పార్టీ మారండి ప్లీజ్ ! సర్వే రిపోర్ట్స్ తో రంగంలోకి దిగిన పీకే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేగం పెంచాడు.ఎట్టిపరిస్థితుల్లోనైనా వైసీపీని గెలిపించాలని చూస్తున్న ఆయన తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాడు.

 Prashant Kishor Phone Calls To Tdp Leaders1-TeluguStop.com

దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైన నాయకులకు గేలం వేసే పనిలో పడ్డాడు.ఆ పార్టీలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారిని వైసీపీలో చేరాల్సిందిగా రక రకాల ఆఫర్స్ తోపాటుచూడండి.

ఇది సర్వే! రాష్ట్రంలో మాదే గెలుపు.మీ నియోజకవర్గంలోనూ మేమే గెలుస్తామని తేలింది.

మీరుకూడా ఇటువైపు వచ్చేయండి! మా కోసం కాదు మీ మేలు కోరి చెబుతున్నాం అంటూ కొంత మందికి ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు సమాచారం.

ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం ఉన్న నేతలను సంప్రదించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం, వారిని తమ వైపునకు తిప్పుకోవడం, కుదరకపోతే తప్పుడు ప్రచారం చేసి వారిని ఆత్మరక్షణలో పడేయడం పనిగా పెట్టుకుందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.ఇప్పటివరకు ఈ వ్యూహాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అప్పగించగా ఇప్పుడు నేరుగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగి నేతలు ఆ పార్టీలోకి వచ్చేలా వారిని ఒప్పించే బాధ్యత భుజాన వేసుకున్నాడు అనే ప్రచారం ఊపందుకుంది.

దాని ప్రకారమే ఈ ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న అభ్యర్థులకు ఫోన్ చేసి తాము నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అంటూ ఒక సర్వే నివేదికను వారికి వినిపిస్తున్నారట.అంతే కాదు మీ నియోజకవర్గంలోనూ వైసీపీయే గెలుస్తుంది’ అంటూ వారిని భయపెట్టేస్తున్నారట.ఇక మీరు ఆలస్యం చేయకుండా మా పార్టీలోకి వస్తే సీటు ఇస్తామని నాది గ్యారంటీ అంటూ వారికి నచ్చచెప్పుతున్నాడట.ఈ విధంగానే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణకు పీకే ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో పితానిపై సొంత పార్టీ నేతల్లో అనుమానం తలెత్తుతుందని, ఆయన్ను దూరంగా పెడితే చేసేదేమీ లేక ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారని పీకే భావించారట.కానీ ఆయన పార్టీ మారేందుకు ఇష్టపడలేదట.

ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన నేతలంతా ఈ విధంగా చేరినవారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube