జాంబీరెడ్డి సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... త్వరలోనే సెట్స్ పైకి

Prasanth Varma Ready For Zombie Reddy Script, Teja Sajja, Anandi, Tollywood, Zambians, South Cinema, Zombie Reddy, Zombie Reddy Sequel, Teja Sajja Zombie Reddy

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.మొదటి సినిమానే విభిన్న కథాంశం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ తర్వాత రాజశేఖర్ తో కల్కీ అనే సినిమా చేశాడు.

 Prasanth Varma Ready For Zombie Reddy Script, Teja Sajja, Anandi, Tollywood, Zam-TeluguStop.com

ఈ మూవీ కూడా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిన బడ్జెట్ ఎక్కువ కావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.

అయితే రీసెంట్ గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా టర్న్ అయిన తేజ సజ్జాతో జాంబీరెడ్డి సినిమా తెరకెక్కించి హిట్ కొట్టాడు.టాలీవుడ్ కి అస్సలు పరిచయం లేని జాంబియన్స్ కాన్సెప్ట్ ని ఈ సినిమాతో పరిచయం చేశాడు.

ఇక ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ వైపు జాంబియన్స్ ని ప్రాజెక్ట్ చేస్తూనే మరో వైపు అవుట్ అండ్ అవుట్ ఫన్ జెనరేట్ చేసి హిట్ కొట్టాడు.ఎవరేజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.

ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా జాంబిరెడ్డి సీక్వెల్ ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసినట్లు సమాచారం.

ఇక త్వరలో ఈ మూవీకి సంబదించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది.మొదటి సినిమాలో ఉన్న పాత్రలని కొనసాగిస్తూనే సీక్వెల్ ని డిజైన్ మరింత ఫన్ ఎలిమెంట్స్ తో సిద్ధం చేసినట్లు బోగట్టా.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి నార్మల్ అవగానే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడంతో పాటు సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నారని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube