కరోనాను వదులుతున్న ప్రశాంత్ వర్మ  

Prasanth Varma Movie On Corona Virus Prelook To Release Tomorrow - Telugu Awe, Corona Virus, Kalki, Prasanth Varma, Prelook

టాలీవుడ్‌లో వైవిధ్యభరిత కంటెంట్‌తో తెరకెక్కే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు.ఈ క్రమంలోనే ‘అ!’ అనే సినిమాతో టాలీవుడ్‌లో కొత్త ఆలోచన శైలికి తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

 Prasanth Varma Movie On Corona Virus Prelook To Release Tomorrow

ఈ సినిమా కాన్సెప్ట్ సరికొత్తగా ఉండగా, సినీ విమర్శకుల ప్రశంసలు సైతం ఈ సినిమా దక్కించుకుంది.కానీ ఈ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేదు.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీగా రాజశేఖర్ నటించిన ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.ఈ సినిమా పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు.

కరోనాను వదులుతున్న ప్రశాంత్ వర్మ-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా తరువాత మరోసారి ప్రశాంత్ వర్మ తన మార్క్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే కరోనా వైరస్‌పై ప్రశాంత్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

భారత్‌లో కరోనా వైరస్ విజృంభనకు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టుకుంది.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్‌ను ఆయన మే 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

ఇక ఈ సినిమా ప్రీలుక్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా కరోనా వైరస్‌పై ప్రస్తుతం దర్శకనిర్మాతల చూపు పడటంతో ఈ మహమ్మారిపై వరుసగా సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prasanth Varma Movie On Corona Virus Prelook To Release Tomorrow Related Telugu News,Photos/Pics,Images..