కొండారెడ్డి బురుజు సాక్షిగా కరోనా పేరు చెప్పి భయపెడుతున్న ప్రశాంత్ వర్మ  

Prasanth Varma Awe Pv3 Pre Look - Telugu Awe, Corona Virus, Prasanth Varma, Pv3 Pre Look

టాలీవుడ్‌లో హీరోలకంటే కూడా కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు.కానీ వారి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో వారు తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

 Prasanth Varma Awe Pv3 Pre Look

ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు.తన తొలి చిత్రం ‘అ!’తో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఈ డైరెక్టర్, ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకున్నాడు.

ఆ తరువాత కల్కి అనే సినిమాతో మనముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ, ఈ సినిమాతో రాజశేఖర్‌కు అదిరిపోయే సక్సెస్‌ను అందించాడు.కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌పై ఓ సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.

కొండారెడ్డి బురుజు సాక్షిగా కరోనా పేరు చెప్పి భయపెడుతున్న ప్రశాంత్ వర్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిజానికి ఈ సినిమా దేశంలో కరోనా వైరస్ ప్రవేశించక ముందు నుండే తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.కాగా తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ భయంకరంగా ఉండటంతో ప్రేక్షకులు ఇది హార్రర్ సినిమా అయి ఉండవచ్చిన భావిస్తున్నారు.

కర్నూలు కొండారెడ్డి బురుజును పెట్టిన పోస్టర్‌లో ‘కరోనా కేవలం ఆరంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ అయ్యేలా చేశాడు.

మొత్తానికి ప్రశాంత్ వర్మ మరోసారి దమ్మున్న సబ్జెక్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరి ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయం పక్కనబెడితే, ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏదేమైనా ప్రశాంత్ వర్మ కేవలం కంటెంట్‌నే ఎందుకు నమ్ముకుంటాడో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

కాగా ప్రశాంత్ వర్మ చిత్రానికి సంబంధించిన ఈ ప్రీలుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test