సలార్ స్టొరీపై ఎందుకంత కన్ఫ్యూజన్... మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ స్టార్ అయిపోయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.కన్నడ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో కేజీఎఫ్ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

 Prasanth Neel Team Gives Clarity On Salaar Movie, Tollywood, Darling Prabhas, Ug-TeluguStop.com

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడంతో ఊహించని విధంగా సినిమాకి హైప్ వచ్చింది.దానికితోడు పవర్ ఫుల్ కంటెంట్, మేకింగ్ విజన్ కి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు.

దీంతో సినిమాకి బ్రహ్మరథం పట్టారు.ఏకంగా 250 కోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది.

అలాగే ఒక్క కన్నడ బాషలోనే వంద కోట్ల కలెక్షన్ ని కేజీఎఫ్ రాబట్టింది.కేజీఎఫ్ స్ఫూర్తితో ఇప్పుడ ఇతర హీరోలు, దర్శకులు కూడా భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేయడంతో పాటు వాటిని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

కేజీఎఫ్ సినిమాతో హీరో యష్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కంప్లీట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వెంటనే ప్రభాస్ తో సలార్ సినిమా స్టార్ట్ చేసేశాడు.

సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది.కేజీఎఫ్ సినిమాని నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీ సలార్ మూవీ కూడా నిర్మిస్తూ ఉండటం విశేషం.

అయితే కేజీఎఫ్ 2 పూర్తయిన వెంటనే ఎక్కువ గ్యాప్ లేకుండా సలార్ సినిమా స్టార్ట్ చేయడంతో ఈ సినిమా కథ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఉగ్రం రీమేక్ అనే ప్రచారం తెరపైకి వచ్చింది.ఆ కథని కాస్తా మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి ఆవిష్కరిస్తున్నట్లు టాక్ నడిచింది.

అయితే ప్రశాంత్ నీల్ ఆరంభంలోనే ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు.ఉగ్రం సినిమాకి, సలార్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.తాను సొంతంగా రాసుకున్న కథతోనే సలార్ తెరకేక్కుతుందని చెప్పాడు.తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మళ్ళీ ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ ఉగ్రం కథనే సలార్ అని చూచాయగా చెప్పడంతో మరోసారి ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ టీమ్ మరోసారి సలార్ పై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.సలార్ సినిమా కథ ను లాక్ డౌన్ సమయంలో ప్రశాంత్ నీల్ తయారు చేశారు.

అప్పుడే ప్రభాస్ కు కూడా చెప్పడం ఆయన ఓకే అనడం జరిగింది.దీనికి ఉగ్రమ్ కు ఎలాంటి పొంతన పోలిక ఉండదు అంటూ ప్రశాంత్ నీల్ టీమ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube