అక్కడ పీకే బిజీ ! జగన్ వెయిటింగ్ ఇక్కడ ?

పీకే ఈ పేరు దేశవ్యాప్తంగా  రాజకీయ పార్టీలకు,  నాయకులకు బాగా ఫేమస్.ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్ కావడంతో, ఆయన అండదండలు ఉంటే తప్పనిసరిగా ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకంతో ఉంటాయి.వారి నమ్మకానికి తగ్గట్టుగానే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అదే స్థాయిలో ఉంటూ,  తనను వ్యూహకర్తగా నియమించుకున్న పార్టీకి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ,  సక్సెస్ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు తో అఖండ మెజారిటీని దక్కించుకుంది అంటే దానికి కారణం పీకే వ్యూహాలే.ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు.

 Prasanth Kishore Re Entry Soon On Ysrcp Political Strategist-TeluguStop.com

అలాగే తమిళనాడు లోను ఆయన సేవలు అందుతున్నాయి.

ఇప్పుడు పీకే అవసరం జగన్ కు వచ్చిపడింది.ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు జగన్ కు లేకపోయినా , పార్టీపరంగా అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Prasanth Kishore Re Entry Soon On Ysrcp Political Strategist-అక్కడ పీకే బిజీ జగన్ వెయిటింగ్ ఇక్కడ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్టీలో గ్రూపు రాజకీయాలు బాగా పెరిగిపోవడం, వీటి కారణంగా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి కారణాలతో జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పగించినా, ఫలితం లేకపోవడంతో,  ప్రశాంత్ కిషోర్ ద్వారా పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని, అలాగే రాజకీయంగా ముందు ముందు ఇబ్బందులు లేకుండా ప్రయత్నిస్తున్నాడు.

Telugu Ap, Ap Politics, Jagan, Mamatha Benarji, Political Stratagy, Prasanth Kishore, Tdp, Ycp Group Politics, Ys Jangan And Prashanth Kishore, Ysrcp, Ysrcp Group Politics-Telugu Political News

అసలు చాలా కాలం కిందటే ప్రశాంత్ కిషోర్ ను జగన్ సంప్రదించినా,  మిగతా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు అందించడంలో బిజీగా ఉండడంతో ఇక్కడ కు రాలేకపోయారు.అయితే ఎన్నికల తంతు ముగియగానే త్వరలోనే పీకే ఏపీ లో అడుగుపెట్టి, వైసీపీకి రాజకీయంగా ఎదురు లేకుండా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నారట.ఇప్పటికే టీడీపీ బాగా బలహీనం కావడంతో పికే వ్యూహాలతో మరింత గా దెబ్బతీసి ఆ పార్టీ కి ఏపీలో స్థానం లేకుండా చేయాలనే ఉద్దేశంలో ఉన్నారట.       

.

#YsJangan #Jagan #YsrcpGroup #Ysrcp #AP Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు