విజయ్ వెంటపడుతున్నప్రశాంత్ కిషోర్ ! సంగతేంటి ?  

Prasanth Kishore Is The Chief Minister\'s Hopes For Actor Vijay-

రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.ఇప్పటికే తానేంటో ఆయన నిరూపించుకున్నాడు.

Prasanth Kishore Is The Chief Minister\'s Hopes For Actor Vijay- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Prasanth Kishore Is The Chief Minister's Hopes For Actor Vijay-

ఇప్పటికే ఆయన బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ గెలుపులో కీలకం అయ్యాడు.ఇక ఆ తరువాత ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీహార్ లో నితీష్ కుమార్ పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేశారు.

Prasanth Kishore Is The Chief Minister\'s Hopes For Actor Vijay- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Prasanth Kishore Is The Chief Minister's Hopes For Actor Vijay-

దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది.ఆయన తో ఒప్పందం చేసుకుని పీకే వ్యూహాలను అమలు చేసేందుకు దేశ వ్యాప్తంగా పార్టీలు పోటీ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడుకి చెందిన రాజకీయ పార్టీలు కూడా పీకే సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయి.

ఇప్పటికే ఈయన మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.

అయితే కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు ప్రశాంత్‌ కిషోర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు సమాచారం.పార్టీ విధానం విషయంలో ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాలను కమల్ విభేదించడమే ప్రధాన కారణమట.

ఈ నేపథ్యంలో మక్కళ్‌ నీది మయ్యం ఒప్పందం ప్రశాంత్‌ కిషోర్‌తో రద్దు కాబోతున్నట్టు తెలుస్తోంది.

అందుకే దానికి ప్రత్యామ్నాయంగా దళపతి విజయ్ ను రాజకీయాల్లో తీసుకొచ్చి యాక్టివ్ చేసేందుకు పీకే ప్రయత్నిస్తున్నాడట.

ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన బృందం తమిళనాడులో రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు సమగ్ర సర్వే నిర్వహించింది.తమిళనాడులో చేసిన సర్వేలో నటుడు విజయ్‌ కు ఆదరణ ఉన్నట్టు తేలిందట.

పీకే లెక్కల ప్రకారం 28 శాతం ప్రజలు ఆదరణ ఆయనకు ఉన్నట్టు తేలింది.తాము నిర్వహించిన సర్వే వివరాలను విజయ్ కు చూపించి మీరు రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని గెలిపించడానికి తాము వ్యూహ రచన చేస్తామని పీకే భరోసా ఇచ్చాడట.