పాదయాత్ర ఏర్పాట్లలో షర్మిల ? నడిపించబోయే టీమ్ ఇదే ?

త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు వైస్ షర్మిల సిద్ధమవుతున్నారు.ఇప్పటికే నిరుద్యోగ దీక్ష పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతి మంగళవారం పర్యటిస్తూ, తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.

 Prasanth Kishore I-pack Team To Oversee Sharmila Padayathra Arrangments I Pack T-TeluguStop.com

  కానీ అనుకున్న రేంజ్ లో షర్మిల సక్సెస్ కాకపోవడం , పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడం, ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా వైఎస్సార్ టీపి అవతరిస్తుందా అనేది అందరికీ అనుమానం గా ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే తప్ప అన్ని సమస్యలు తొలగవు అని, రాజకీయంగా ఊపు వచ్చేందుకు, పార్టీలో చేరికలు పెరిగేందుకు, ఆదరణ వచ్చేందుకు అవకాశం ఉండదని షర్మిల నమ్ముతున్నారు.

అందుకే పాదయాత్ర వచ్చే నెల నుంచి ఏడాది పాటు చేపట్టేందుకు ఆమె ప్రణాళికలు రచించుకుంటున్నారు.అయితే పాదయాత్ర ఆషామాషీగా ఉండకూడదని, రాజకీయంగా చర్చనీయాంశం కావాలనే ఉద్దేశంలో ఆమె ఉండటంతోనే వైసిపి రాజకీయ వ్యూహకర్తగా గతంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ తో షర్మిల పార్టీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ప్రశాంత్ కిషోర్ ఎవరికి రాజకీయ వ్యూహకర్త గా పనిచేయడం లేదు.కాకపోతే ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ వ్యూహాలు అందిస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రియా అనే మాజీ ఐ ప్యాక్ టీమ్ సభ్యురాలి నేతృత్వంలో ఒక టీమ్ పని చేస్తోంది.

Telugu Pack, Padayathra, Pk, Telangana, Ys Sharmila, Ysrcp-Telugu Political News

అంతేకకుండా ఇప్పుడు పాదయాత్ర కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఐ ప్యాక్ టీమ్ చూడబోతున్నట్టు, పాదయాత్ర ఏ విధంగా చేయాలి ? యాత్రలో హైలెట్ అయ్యే విధంగా ఏఏ అంశాలు ఉండాలి ? ఎవరెవరు పాల్గొనాలి ? ఏ అంశాల గురించి షర్మిల మాట్లాడాలి ? తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎటువంటి ప్రసంగాలు చేయాలి ? ఇలా అనేక అంశాలను ఐ ప్యాక్ టీమ్ సూచించబోతోందట.పాదయాత్ర ద్వారానే తమ పార్టీకి రాజకీయ మైలేజ్ పెంచుకోవాలి అనే ఆలోచనలో షర్మిల నిమగ్నం అయ్యారు.అందుకే పూర్తిగా ఐ ప్యాక్ టీమ్ సూచనలతోనే ఆమె నడిచేందుకు సిద్ధం అవుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube