కూతురుని పరిచయం చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్

బాలీవుడ్ లో సెలబ్రెటీ కపుల్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు.అయితే సౌత్ లో అలాంటి సెలబ్రెటీ జంటలు చాలా తక్కువ.

 Actress Sneha Shares Her Daughter Aadhyantha First Pics, Prasanna, Actress Sneha-TeluguStop.com

ఉన్నవాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.పెళ్లి చేసుకున్నవారు కూడా బాలీవుడ్ తరహాలో విడాకులు తీసుకోకుండా ఒకరికి ఒకరు అనే విధంగా ఉంటారు.

అలాంటి కపుల్స్ లో నాగార్జున-అమల, రాజశేఖర్-జీవిత, శ్రీకాంత్-ఊహ లాంటి వారు తెలుగులో ఉన్నారు.ఇక తమిళంలో కూడా స్నేహ-ప్రసన్నకుమార్ బెస్ట్ కపుల్స్ అనేదానికి ఉదాహరణగా కనిపిస్తారు.

ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కూడా ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తున్నారు. స్నేహ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం పీక్ లో ఉంది.

ప్రసన్న కూడా ఓ వైపు నెగిటివ్ రోల్స్, మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ గా ఉన్నాడు.ఇక కోలీవుడ్ లో వీళ్ళ రిలేషన్, లవ్ స్టోరీ గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా చెప్పుకుంటారు.

ఇక వీరు రీసెంట్ గా రెండో బిడ్డకి జన్మనిచ్చారు.ఇప్పుడు వారి కూతురుని అందరికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో కూతురిని ఎత్తుకొని వారిద్దరూ ఉన్న ఫోటోని స్నేహ పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఫోటో పోస్ట్ చేయడంతో తమ గారాలపట్టి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ కూడా స్నేహ పెట్టింది.ఈ సందర్భంగా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది.పుట్టిన రోజు శుభాకాంక్షలు టూ మై సోల్‌ మేట్‌.

మై లవర్‌ బాయ్‌.గార్డియన్‌ ఏంజిల్‌.సూపర్‌ డాడా.ఈ లడ్డులతో నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు.సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి, శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ కుమార్తె ఫోటోలు స్నేహ షేర్‌ చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube