అధికారులపై మండి పడుతున్న హీరోయిన్ స్నేహ భర్త… కారణం ఏంటంటే….?  

Prasanna Kumar Kollywood Hero - Telugu Electricity Department, Kollywood Hero, Prasanna Kumar, Sneha, Telugu Heroine, Tollywood

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కుమార్ విద్యుత్ బోర్డు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అయితే అందుకుగల కారణాలు లేకపోలేదు.

 Prasanna Kumar Kollywood Hero

ఇటీవలే తన ఇంటికి సంబంధించినటువంటి విద్యుత్ వినియోగ బిల్లు ని అధికారులు తన ఇంటికి పంపించారని అయితే ఆ బిల్లు చూసినటువంటి ప్రసన్నకుమార్ ఒక్కసారిగా కంగు తిన్నానని తెలిపాడు.అయితే ఇంతకీ ఆ బిల్లులో ఏముందంటే నెలవారి బిల్లు మొత్తం దాదాపుగా 70 వేల రూపాయలు కట్టాల్సి ఉందని సంబంధిత అధికారులు రసీదు లో పేర్కొన్నారని తెలిపాడు.

దీంతో ఈ విషయంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ తన ఇంటికి కేవలం రెండు విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని ఒకవేళ నెల మొత్తం ఆ రెండు కనెక్షన్లను విరివిగా ఉపయోగించినప్పటికీ అంత మొత్తంలో విద్యుత్ బిల్లు రాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అంతేగాక తన లాంటి వాళ్ళు అయితే ఇలాంటి  విద్యుత్  బిల్లులను కట్టగలరని కానీ సామాన్యులపై ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలను బానాయిస్తే ఎలా కట్టగలరని ప్రశ్నించాడు.

అధికారులపై మండి పడుతున్న హీరోయిన్ స్నేహ భర్త… కారణం ఏంటంటే….-Latest News-Telugu Tollywood Photo Image

కాగా ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఓ గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా  మొత్తములో విద్యుత్ ఛార్జీలు కట్టాలంటూ రసీదులు పంపించారు.దీంతో కొందరు సామాన్య ప్రజలు సదరు విద్యుత్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రసన్నకుమార్ పలు టాలీవుడ్ కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prasanna Kumar Kollywood Hero Related Telugu News,Photos/Pics,Images..

footer-test