అనుష్కలా రిస్క్ చేస్తున్న ప్రణీత.. ఏం జరుగుతుందో..?

సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అనుష్క కెరీర్ తొలినాళ్లలో స్టార్ హీరోలకు జోడీగా నటించిన సంగతి తెలిసిందే.అయితే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కి 2009లో విడుదలైన అరుంధతి సినిమా అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది.

 Pranitha Taking Daring Step For Bollywood Film, Pranitha,pranitha To Gain Weight-TeluguStop.com

ఆ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగల హీరోయిన్ గా అనుష్కకు మంచి పేరు వచ్చింది.

అరుంధతి తరువాత ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనుష్క నటించారు.

సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగి ఆ పాత్రలో నటించారు.సైజ్ జీరో సినిమాలో అనుష్క పాత్రకు మంచి పేరు వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే ఆ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఎంతో కష్టపడినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో బరువు తగ్గలేదు.అయితే టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా అనుష్క బాటలోనే పయనిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Ajay Devagan, Ajay Devgn, Anushka, Bollywood, Step, Praneetha, Pranitha,

అయితే ప్రణీత సన్నగా కనిపించబోయేది మాత్రం టాలీవుడ్ సినిమాలో కాదని తెలుస్తోంది.అజయ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ప్రణీత రెండు పాత్రలలో కనిపించనుందని ఒక పాత్రలో స్లిమ్ లుక్ లో మరో పాత్రలో లావుగా కనిపించనున్నారని తెలుస్తోంది.అతి త్వరలో లావు పాత్రలో ప్రణీత రోల్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.అయితే అనుష్కలా బాపు బొమ్మ ప్రణీత బరువు పెరగాలని తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకసారి లావు పెరిగితే మళ్లీ సన్నబడటం అంత తేలిక కాదు.అయితే వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తే మంచి గుర్తింపు వస్తుందని ప్రణీత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అనుష్క లావు పెరిగినా ఆ పాత్ర చేదు అనుభవాన్ని మిగల్చగా ప్రణీతకైనా ఆ పాత్ర సక్సెస్ ను ఇస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube