ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తిన ప్రణీత

భావ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ప్రణీత శుభ.మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా తరువాత ఈ అమ్మడుకి అవకాశాలు బాగానే వచ్చాయి.

 Pranitha Subhash Item Girl In Krack Movie, Tollywood, Telugu Cinema, Sandalwood,-TeluguStop.com

అయితే తెలుగులో కంటే మాతృభాషలోనే స్టార్ హీరోయిన్ గా ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో పవన్ కళ్యాణ్, తారక్ లాంటి స్టార్స్ తో నటించిన అక్కడ సెకండ్ లీడ్ రోల్స్ కి పరిమితం అయిపోవడం, ఆపై సినిమాలు డిజాస్టర్ కావడంతో తరువాత టాలీవుడ్ నుంచి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

టాలీవుడ్ కాదన్న మాతృభాష మాత్రం ప్రణీతకి మంచి గౌరవం ఇచ్చింది.అక్కడ స్టార్ హీరోలతో ఈ భామ జతకట్టింది.

ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఇప్పటికే ఒక సినిమాని పూర్తి చేసింది.

ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ టైంలో ఆమె చేసిన సోషల్ సర్వీస్ తో మరోసారి అందరిని ఆకర్షించింది.

Telugu Krack, Raviteja, Sandalwood, Telugu, Tollywood-Movie

ఇక ఈ భామ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తుంది.అయితే అది హీరోయిన్ గా కాదు.రవితేజ క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ప్రణీతని తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సాంగ్ ఇప్పటికే షూటింగ్ అయిపొయింది.ఇక సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి రవితేజ, ప్రణీత చేసిన సాంగ్ ని త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఐటమ్ గర్ల్ గా అయినా తెలుగులో ప్రణీతని మళ్ళీ గుర్తించి అవకాశాలు ఇస్తారేమో అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube