సాయం చేయడానికి ఇదే సరైన సమయం అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

భావ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తరువాత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకి జోడీగా నటించిన కన్నడ భామ ప్రణీత శుభాష్ .ఈ అమ్మడు తెలుగులో సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినా హిందీలో మూడు సినిమాలు అలాగే మాతృభాషలో కొన్ని సినిమాలు చేస్తుంది.

 Heroine Pranitha Subhash Donates Oxygen Cylinders-TeluguStop.com

ఇదిలా ఉంటే కరోనా టైమ్ లో సోనూసూద్ తన సోషల్ సర్వీస్ తో ఎంతగా పాపులర్ అయ్యాడో ప్రణీత కూడా అదే స్థాయిలో పాపులర్ అయ్యింది.సోనూ గత ఏడాది కరోనా కష్టం కాలంలో వలస కూలీలని గమ్యానికి చేర్చడంతో పాటు తరువాత చాలా మంది కష్టాలు తీర్చే ప్రయత్నం చేశాడు.

అలాగే కరోనా సమయంలో హీరోయిన్స్ అందరూ ఇంటికే పరిమితం అయిపోతే ప్రణీత మాత్రం బయటకొచ్చి అభాగ్యులకి ఆపన్నహస్తం అందించి ఆకలి తీర్చింది.రోడ్డున పడి బ్రతుకుతున్న వారికి ప్రతిరోజు ఆహారం అందించేది.

 Heroine Pranitha Subhash Donates Oxygen Cylinders-సాయం చేయడానికి ఇదే సరైన సమయం అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఆమె బెంగుళూరులో ఒక్కసారిగా తన సేవాకార్యక్రామలతో మీడియా దృష్టిలో పడింది.తరువాత కూడా రకరకాలుగా తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించింది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రణీత మరోసారి తన గొప్ప మనసు చాతుకుతుంది.

ప్రతి రోజు ఆక్సిజన్ సిలిండర్స్ ని ఉచితంగా అందిస్తుంది.చాలా మంది ఊరికి అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తనకు తోచిన స్థాయిలో ప్రాణవాయువుని అందించే ప్రయత్నం చేస్తుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనతో పాటు ఆపదలో ఉన్న మనలాంటి వారికి సాయం చేసే గొప్ప అవకాశం ప్రస్తుతం మనకొచ్చిందని చెబుతుంది.సాయం చేయడానికి ఇదే సరైన సమయం అంటూ తన వ్యక్తిత్వంతో అందరికి స్ఫూర్తి అందిస్తుంది.

#Kollywood #Donating #Pranith Subhash #Bangalore #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు