ఆ రీజన్ వల్లే పెళ్లి చేసుకున్నానన్న ప్రణీత.. ఏం చెప్పారంటే..?

గత నెలలో ప్రణీత అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని అభిమానులతో పాటు అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ప్రణీత పెళ్లి గురించి స్పందించి కరోనా, లాక్ డౌన్ రూల్స్ వల్లే పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు.

 Pranitha Subash Comments About Marriage First Time-TeluguStop.com

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న ప్రణీత అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం గురించి మరోసారి స్పందించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.కరోనా పరిస్థితులతో పాటు ఆషాడం వల్ల నిరాడంబరంగా పెళ్లి చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

మొదట సినిమా రంగానికి చెందిన వాళ్లతో పాటు బంధుమిత్రులతో పెళ్లి చేసుకోవాలని భావించామని అయితే జులై నెలలోనే ఆషాడ మాసం ఉండటంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.తన కుటుంబం సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రణీత వెల్లడించారు.

 Pranitha Subash Comments About Marriage First Time-ఆ రీజన్ వల్లే పెళ్లి చేసుకున్నానన్న ప్రణీత.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ కారణం వల్లే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నానని ప్రణీత వెల్లడించారు.

Telugu Bhuj, Comments About Marriage, Corona, First Time, Hangama2, Lock Down, Praneetha Subash, Tollywood-Movie

తన పెళ్లి జరిగే సమయంలో సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని ప్రణీత తెలిపారు.సమాజంలో అలాంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆడంబరంగా వివాహం చేసుకోవాలని తాను అనుకోలేదని ప్రణీత చెప్పుకొచ్చారు.ప్రణీత ప్రస్తుతం భుజ్, హంగామా 2 సినిమాలలో నటించగా ఈ రెండు సినిమాలలో భుజ్ ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది.

హంగామా 2 మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమాలతో పాటు ప్రణీత చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి.పెళ్లి తర్వాత కూడా ప్రణీత సినిమాల్లో నటిస్తారని తెలుస్తోంది.తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించినా ప్రణీత సినిమాల విషయంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఇతర భాషల్లో ప్రణీత నటిగా సక్సెస్ కావడంతో ఆ భాషల్లో నటించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ప్రణీత లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సాయం చేసిన సంగతి తెలిసిందే.

#Bhuj #Lock Down #Corona #First Time #CommentsAbout

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు