బాలీవుడ్ లో అవకాశాలు పట్టేసా అంటున్న ప్రణీత

తెలుగులో భావ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ప్రణీత.ఆ తరువాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకుంది.అయితే తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.దీంతో మాతృభాషలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామని తెలుగు దర్శకులు చాలా వరకు మరిచిపోయారనే చెప్పాలి.ఇలాంటి వేళ లాక్ డౌన్ కారణంగా బెంగుళూరులో తిండి కోసం వెతలు పడుతున్న వారికి అండగా నిలబడి తన దొడ్డ మనసు చాటుకుంది.హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉంటే ప్రణీత మాత్రం పేదలకి ఆహారం అందించడంలో, లాక్ డౌన్ కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండటంలో బిజీగా ఉంది.

 Pranitha Shubha Got Chance In Bollywood, Tollywood, South Cinema, Lock Down, Tel-TeluguStop.com

దీంతో మరోసారి ప్రణీత ఈ సమయంలో వార్తలలో నిలిచింది.మీడియా చానల్స్, వెబ్ సైట్స్, పత్రికలు ఈమె వార్తలకి ప్రాధాన్యత ఇచ్చాయి.దీంతో ఈ అమ్మడుపై అందరి దృష్టి పండింది.ఈ నేపధ్యంలో ఈ చానల్ ఇంటర్వ్యూలో తన సినిమా అవకాశాలపై ప్రణీత ప్రస్తావించింది.

బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. అజయ్ దేవగణ్ తో ఒక సినిమా, ప్రియదర్శన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను.

తెలుగు నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు వస్తే కనుక చేస్తాను అని చెప్పింది.మొత్తానికి తెలుగులో అవకాశాలు దూరం అయిన బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఈ అమ్మడు అవకాశం పట్టేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube