ఫాలోవర్స్ తో పెద్దగా ప్రయోజనం లేదు అంటున్న బాపుబొమ్మ

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గరగా ఉంటున్నారు.అభిమానులు కూడా లక్షల సంఖ్యలో తమకి ఇష్టమైన సెలబ్రిటీలని ఫాలో అవుతూ ఉంటారు.

 Pranitha Says All Social Media Followers Are Not Useful, Tollywood, Bollywood, S-TeluguStop.com

హీరోయిన్స్ అయితే రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లు తన ఇన్స్టాలో షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారికి ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు.అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి ఉండే ఫాలోవర్స్ అందరూ కూడా కేవలం వాళ్ళ రీల్ లైఫ్ ని మాత్రమే ఇష్టపడతారు.

సెలబ్రిటీల రియల్ లైఫ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. అందాల భామలు పెట్టె గ్లామర్ ఫోటోలు ఆశ్వాదించడానికి వారిని ఫాలో అవుతారు.

అంతకు మించి వారితో పెద్దగా సెలబ్రిటీలకి పని ఉండదు.వారి వాళ్ళ సెలబ్రిటీలకి ఆదాయం వస్తుంది తప్ప అంతకు మించి పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఇదే విషయాన్ని అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించిన కన్నడ భామ ప్రణీత చెబుతుంది.సోషల్ మీడియా ఓ ఊహాజనిత ప్రపంచం.అందులో ఎంత మంది ఫాలోయర్లు ఉన్నా లాభం లేదని, మనం ఎప్పటికి ఒంటరే అని కథానాయిక ప్రణీత సుభాష్ చెబుతోంది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా చూపెడుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో 9.8 మిలియన్ ఫాలోయర్లు, ట్విట్టర్ లో 1.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్న వ్యక్తి ఒంటరిగా మిగిలాడు.దీనిని అర్థం చేసుకోండి.

ఊహాజనిత ప్రపంచమంతా ఫేక్ అని ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.ఇక సుశాంత్ మరణం తర్వాత సెలబ్రిటీ జీవితాలు బయటకి కనిపించే అంత అందంగా ఏమీ లేవని, చాలా మంది మానసిక సమస్యలతో, వాటికి ఎవరికీ చెప్పుకోలేక క్రుంగుబాటుకి గురవుతూ ఉంటారని చాలా మందికి అర్ధమైంది.

అయిన కూడా జనాలు సినిమాని రంగుల ప్రపంచంగా చూడటానికే ఇష్టపడతారు తప్ప ఈ విషయాలు కొద్ది రోజులు ఆలోచించి మరిచిపోతారు.అయితే సెలబ్రిటీ జీవితాలలో ఒకరికి ఒకరు తోడు అవసరం అని మాత్రం ఈ ఉదంతం రుజువు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube