ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై హీరోయిన్‌ ప్రశంసలు

ఈ కరోనా విపత్తు నేపథ్యంలో పేదలు తిండిలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ సమయంలో పలువురు దాతలు తమ వంతు సాయంను అందించేందుకు ముందుకు వస్తున్నారు.

 Pranitha Appreciate The Ntr Fans About Distribute The Daily Needs, Ntr, Tollywoo-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు దాదాపు అందరు కూడా కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు సాయం ప్రకటించాయి.

ఇక వారి ఫ్యాన్స్‌ కూడా హీరోల పేర్లు చెప్పి సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గత నెలన్నర రోజులుగా పేదలకు తమవంతు సాయంను చేస్తున్నారు.

ఏపీలోని పలు జిల్లాల్లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పేదలకు వలస కూలీలకు నిత్యావసరాలను అందజేస్తున్నారు.పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలపై హీరోయిన్‌ ప్రణీత స్పందించింది.

ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పోస్ట్‌ పెట్టారు.ఆ పోస్ట్‌కు స్పందిస్తూ సూపర్‌ అంటూ ప్రణీత రీ ట్వీట్‌ చేసింది.

Telugu Ap Ntr Fans, Ntr Fans, Pranitha, Tollywood, Tollywood Heros-Movie

ఎన్టీఆర్‌ పేరుతో ఫ్యాన్స్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలను నెట్టింట గత కొన్నాళ్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.ఇతర హీరోల ఫ్యాన్స్‌ తో పోల్చితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం అంటూ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube