ఖిలాడితో చిందులేయనున్న పవన్ మరదలు!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Praneetha Item Song In Raviteja Khiladi-TeluguStop.com

కాగా ఈ సినిమాలో రవితేజ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు రవితేజ.

దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్న మాస్ రాజా.పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

 Praneetha Item Song In Raviteja Khiladi-ఖిలాడితో చిందులేయనున్న పవన్ మరదలు-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఓ అదిరిపోయే హాట్ ఐటెం సాంగ్ ఉండబోతుందని, అందులో ఓ క్రేజీ బ్యూటీ మాస్ స్టెప్పులతో రచ్చ లేపనున్నట్లు తెలుస్తోంది.అందాల భామ ప్రణీత సుభాష్ ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌లో రవితేజతో చిందులేయనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని బాపుగారి బొమ్మో అనే పాటలో ప్రణీత పర్ఫార్మెన్స్‌కు అప్పట్లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో ఇప్పుడు ఈ బ్యూటీని ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు ఖిలాడి యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఖిలాడి చిత్రంలో ప్రణీత ఐటెం సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Raviteja #Khiladi #Item Song

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు