సముద్రంలో అడ్వెంచర్స్ చేస్తున్న ప్రణీత..!

అక్టోబర్ 30న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో కలిసి మాల్దీవ్స్ కు హనీమూన్ కి వెళ్లి అక్కడ రోజుకు ఒక ఫోటో షూట్ చేసి తన అభిమానుల కోసం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా రోజు షేర్ చేస్తూనే ఉంది.ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి స్కూబా డైవింగ్ చేసిన వీడియో కూడా షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Praneetha Doing Adventures In The Sea , Praneetha, Under Water Travel, Viral Vid-TeluguStop.com

ఇకపోతే తాజాగా టాలీవుడ్ మరో హీరోయిన్ ప్రణీత సుభాష్ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

లాక్ డౌన్ సమయంలో తనకు తోచిన విధంగా ఆవిడ ఎంతో మంది నిరాశ్రయులకు పెద్ద ఎత్తున సహాయం చేసింది.ఆ సమయంలో ఆవిడ ఎంతో మంది మన్న లను గెలుచుకుంది.కేవలం సాయం చేయడమే కాదు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చింది.ఇకపోతే తాజాగా ఈవిడ మాల్దీవుల్లోని నీలిరంగు సముద్రం లో డ్రైవ్ చేస్తున్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఇక ఈ వీడియోలో ఆవిడ ఏలాంటి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోకుండా స్కూబా డైవింగ్ చేసింది.ఈ వీడియోని చూసి నెటిజెన్స్ నిజంగా ప్రణీతకు చాలా ధైర్యం ఉందని పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు.

ఇది వరకు ఆమెకు స్కూబా డైవింగ్ లో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఈ విధంగా ఆవిడకు సాధ్యం అయింది.ఇకపోతే ప్రణీత సుభాష్ తెలుగు సినిమాలలో ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా కనబడట్లేదు.

ఇదివరకు కూడా తెలుగు సినిమాల్లో నటించిన భారీ విజయాన్ని మాత్రం ఆవిడ అందుకోలేదు.అయితే టెలివిజన్ రంగంలో ఏవైనా కార్యక్రమాలు జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రణీత సుభాష్ ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఎలా స్కూబా డైవింగ్ చేసిందో ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube