ప్రణయ్ 'ఆత్మ' ఆ విషయాలు చెప్తోందా ..?   Pranay Soul Do Those Things     2018-10-15   19:59:05  IST  Sai M

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌… ఆత్మగా మారిపోయాడా? అతని ఆత్మ అమృత చుట్టే తిరుగుతోందా? పోయిన జన్మలో ప్రణయ్‌, మారుతీరావులిద్దరూ బద్ధశత్రువులా? అందుకే ఈ జన్మలో పగ తీర్చుకున్నాడా? ఇప్పుడివే వదంతులు మిర్యాలగూడలో షికారు చేస్తున్నాయి.

అసలు ఈ వదంతులకు కారణం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన నాగారావు, సత్యప్రియ దంపతులు.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మిర్యాలగూడలోని ప్రణయ్‌ ఇంటికెళ్లిన వీళ్లిద్దరూ.. అతని తల్లిదండ్రులతో కొద్దిసేపు మాట్లాడారు. అమృతను ఓదార్చారు. అనంతరం, ప్రణయ్‌ ఆత్మ తమతో రెగ్యులర్‌గా మాట్లాడుతోందని, అనేక విషయాలు చెబుతోందంటూ.. కొద్దిసేపు ప్రార్థనలు చేశారు. విగ్రహం ఏర్పాటు చేయడం ప్రణయ్‌కి ఇష్టం లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే ఆత్మ అందులోకి వెళ్లిపోతుందని చెప్పారు. పోయిన్‌ జన్మలో ప్రణయ్‌, మారుతీరావులు బద్ధశత్రువులనీ.. ఈ జన్మలో మారుతీరావు పగ తీర్చుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆత్మ అమృతకోసం ఎదురుచూస్తోందని, తమతో వస్తే చూపిస్తామని, మాట్లాడిస్తామని చెప్పారు.

Pranay Soul Do Those Things-

నాగారావు దంపతులు చెబుతున్న మాటలపై అనుమానం రావడంతో.. పోలీసులను ఆశ్రయించారు ప్రణయ్‌ తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగారావు, సత్యప్రియలతో పాటు వారి వెంట వచ్చిన మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు గతంలోనూ ఫోన్‌చేసి ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడిస్తానని చెప్పారని అమృత చెప్పడంతో.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన వాళ్లెవరు? అమృతను ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.