'ప్రియ‌మైన అమృత‌కు.....ప్ర‌ణ‌య్ రాయున‌ది' అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి!  

Pranay Last Love Letter For Amruthavarshini Goes Viral In Social Media-

మ‌న‌కేమైనా అయితే., మ‌నం పోతే ద మోస్త్ ఎఫెక్టెడ్ ప‌ర్స‌న్ ఒక్కరుంటారు అది నా లైఫ్ లో ఆ పిల్ల., అ పిల్లకి ఏమైనా అయితే i ‘ll be most effected… understand. ! ఇలా స‌ర‌దాగా చెప్పుకున్న డ‌బ్ స్మాష్ లే నిజ‌మైతాయ‌ని ఊహించ‌లేదు అమ్ము.! నేనే ప్ర‌పంచంగా బ‌తికిన నీ ప‌రిస్థితిని ఊహించ‌డానికే… మ‌రో క‌త్తిపోటు మెడ‌మీద దించుకున్న‌ట్లుంది అమ్ము.!

అయినా…5 ల‌క్ష‌లు అడ్వాన్స్ తీసుకొని క‌త్తివేటుతో నీ నుండి న‌న్ను దూరం చేసిన ఆ న‌ర‌హంత‌కునికి ఏం తెలుసు ప్రేమ గురించి.? ప‌రువు కోసం కులం త‌క్కువ‌ని న‌న్ను కాటికి పంపిన మీ నాన్న‌కేం తెలుసు ప్రేమ గురించి.? అయినా ప్రేమ‌కు కుల‌మేంటి… అమ్ము.? వీరి పిచ్చికాక‌పోతే…. గువ్వాగోరింక‌ల్లాంటి మ‌న‌ల్ని వేరు చేసి వారు సాధించిందేంటి?

మ‌రో మూడు నెల‌ల్లో మ‌న‌కు పుట్ట‌బోయే పాప గురించి క‌న్న ఎన్నో క‌ల‌లు… వాడి రాక‌తో అయినా మీ నాన్న మ‌న‌స్సు క‌రుగుతుందేమోన‌నే ఆశ‌… మ‌న ప్రేమ గెలిచింది అని స‌గ‌ర్వంగా చెప్పుకోవాల‌నుకున్న కాంక్ష‌…. అన్నీ…అన్నీ….. నా నిర్జీవ దేహంతో పాటు స‌జీవంగా స‌మాధి అయ్యాయి…అమ్ము.!

క‌ల‌కాలం నీతోనే…నిన్ను సంతోష‌పెట్ట‌డ‌మే నా ఈ జీవితమంటూ ….నీకిచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక విగ‌త‌జీవిగా ప‌డిఉన్నందుకు న‌న్ను క్ష‌మించు అమ్ము.! నా మెడ‌పై ప‌డిన రెండు క‌త్తివేట్లు ….. భౌతికంగా నన్ను నీ నుండి విడ‌దీశాయేమో కానీ, ప్ర‌తి ప్రేమ జంట స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌లో న‌న్ను స‌జీవంగా ఉంచాయి అమ్ము.!

ఐ ల‌వ్యూ అమ్ము ….. టేక్ కేర్ …నా అంతిమ సంస్కారానికి టైమైంది. బై.