వర్మపై కేసు పెట్టిన ప్రణయ్ తండ్రి  

Pranay Father Files Case On RGV, Pranay, Amrutha, Caste Murder, Ram Gopal Varma, Murder Movie - Telugu Amrutha, Caste Murder, Murder Movie, Pranay, Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.గతంలో రక్తచరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో పలు వివాదాలను క్రియేట్ చేసిన వర్మ, ఈసారి పరువు హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 Pranay Father Pranay Amrutha Rgv

‘మర్డర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశాడు వర్మ.

ఈ సినిమాను వర్మ ఎలా తెరకెక్కిస్తాడా అనే సందేహం అందరిలో మొదలైంది.

వర్మపై కేసు పెట్టిన ప్రణయ్ తండ్రి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వల్ల తన కుమారుడి పరువుకు భంగం కలుగుతుందని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి నల్గొండ 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు వేశాడు.దీంతో ఈ కేసును ఎస్సీ,ఎస్టీ కోర్టుకు మార్చడంతో వర్మకు నోటీసులు జారీ అయ్యాయి.

ప్రణయ్ పరువుకు భంగం కలిగిస్తున్నాడనే కారణంగా ఈ సినిమాను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి కోరాడు.

అయితే ఈ సినిమా డైరెక్టర్ వర్మతో పాటు సహ నిర్మాత నట్టి కరుణపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

ఏదేమైనా మర్డర్ సినిమాను తెరకెక్కించి తీరుతానంటూ వర్మ చెప్పుకొస్తున్నాడు.మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

ఇక ఇటీవల అమృత కూడా వర్మపై ఘాటుగా స్పందిస్తూ ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కూడా ఓ సినిమా తీసేందుకు వర్మ రెడీ అయ్యాడు.

#Amrutha #Caste Murder #Ram Gopal Varma #Pranay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pranay Father Pranay Amrutha Rgv Related Telugu News,Photos/Pics,Images..