కెనడాలో ఆత్మహత్య: స్వగ్రామానికి చేరిన ప్రణయ్ మృతదేహం  

ప్రేమించిన యువతి మోసం చేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తెలుగు యువకుడు ప్రణయ్ మృతదేహం కెనడా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చేరుకుంది.ప్రయోజకుడిగా స్వగ్రామంలో అడుగుపెడతాడునుకున్న కొడుకు.నిర్జీవంగా వచ్చే సరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

TeluguStop.com - Pranay Dead Body Reached From Canada To Ananthapuram

హైదరాబాద్హబ్సిగూడలో ఉండే నివసిస్తున్న ప్రణయ్ కెనడాలో ఉద్యోగం చేసేవాడు.ఈ క్రమంలో అక్కడ ఓ యువతిని ప్రేమించాడు.ఆమె చాలా చిత్రమైనదనీ… సిగరెట్లు తాగుతూ తనను కూడా స్మోక్ చేయాలని బలవంత పెట్టిందని ప్రణయ్ తెలిపాడు.తనను అన్ని రకాలుగా వాడుకుని చివరికి హెచ్ 1 బీ వీసా రాగానే తనకు చెప్పకుండానే వెళ్లిపోయిందని ప్రణయ్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపాడు.తనతో సహజీవనం చేస్తూనే మాజీ లవర్‌తో చాట్ చేసేదనీ, చాటింగ్ చేయవద్దని చెప్పినందుకు తనతో గొడవపడేదని అతను వాపోయాడు.

తనతో పాటు మరో ఆరుగురు యువకుల్ని కూడా ఇదే తరహాలో ఆమె మోసం చేసిందని వెల్లడించాడు.

TeluguStop.com - కెనడాలో ఆత్మహత్య: స్వగ్రామానికి చేరిన ప్రణయ్ మృతదేహం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు తమ కుమార్తెపై ప్రణయ్ ఆరోపణల నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అతనిపైనే రివర్స్ అయ్యారు.తమ కూతురిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడంతో… ప్రణయ్ మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.ఆమె చేస్తున్న మోసాల్ని బయటపెట్టేందుకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు.

తన గురించి ఎవరూ బాధపడవద్దని, తన అవయవాలు దానం చేయాలని, తన శరీరాన్ని కూడా పరిశోధనల్లో వాడేలా చూడాలని ప్రణయ్ తన చివరి కోరికగా తల్లిదండ్రులను కోరాడు.ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు కెనడాలోని భారతీయ సమాజంలో తీవ్ర సంచలనం రేపింది.

#NRI Pranay #IndianStudent #PranayDeth #PranayDead

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pranay Dead Body Reached From Canada To Ananthapuram Related Telugu News,Photos/Pics,Images..