మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం..!

భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ ఆస్పత్రి వెల్లడించింది.ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీకి వెంటిలేటర్‎పై చికిత్స అందుతోందని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది.

 Pranab Mukherjee, Corona Virus, Former President, India, Brain Surgery,-TeluguStop.com

బ్రెయిన్ సర్జరీ కోసం ఆయన సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‎లో చేరారు.సోమవారం మధ్యాహ్నం 12.07 గంటలకు తమ ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంది.ప్రణబ్ ముఖర్జీ మెదడుకు వెళ్లే నాణాల్లో రక్తం గడ్డ కట్టిందని.

ఇప్పటికే ఆయనకు ఆపరేషన్ చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.కాగా, ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.

వైద్యుల సూచన మేరకు అక్కడ ప్రణబ్ ముఖర్జీ కరోనా పరీక్షలు చేయించుకోగా.పాజిటివ్‎గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.వారం రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ సూచించారు.

కాగా, సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ ఆస్పత్రికి వెళ్లి మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తదితరులు ట్వీట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube