ట్రంప్ ని ఊరికే వదిలేయకూడదు...ఇండో అమెరికన్ ప్రమీలా...!!!  

Pramila Jayapal On Trump Impeachment-nri,pramila Jayapal,trump Impeachment

ట్రంప్ పై రోజు రోజుకి అమెరికా వ్యాప్తంగా డెమొక్రాట్ల నిరసనలు ఎక్కువవుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డెమోక్రాట్లు ఈ ఎదురు దాడులు ఎక్కువ చేశారు.

Pramila Jayapal On Trump Impeachment-nri,pramila Jayapal,trump Impeachment Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)- Visa Immigration,Events,O-Pramila Jayapal On Trump Impeachment-Nri Pramila Impeachment

ఎలాగైనా సరే ట్రంప్ గద్దె దిగడమే ధ్యేయంగా పెట్టుకున్న డెమోక్రటిక్ పార్టీ అందుకు అనుగుణంగా ట్రంప్ చేసిన తప్పులు, అధికార దుర్వినియోగాలని ప్రజా క్షేత్రంలోకి తీసుకువేల్తున్నారు.ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన మహిళ.

ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలైన ప్రమీలా జయపాల్ ట్రంప్ పై ఫైర్ అయ్యారు.అధికార దుర్వినియోగం చేసిన ట్రంప్ భవిష్యత్తులో అధ్యక్షుడిగా పోటీ చేయడం అనేది అమెరికా భవిష్యత్తుకి మంచిది కాదని ఆమె తెలిపారు.

అంతేకాదు ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసనకి ఆమె గట్టి మద్దతుగా నిలిచారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రంప్ ని ఇలాగే వదిలిస్తే రానున్న అమెరికా అధ్యక్షులు కూడా తమ సొంత స్వార్ధ ప్రయోజనాలని అమెరికా ప్రజలపై ఇలానే రుద్దుతారని, అమెరికా భద్రతా, ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారుతాయని అన్నారు.

ఇదిలాఉంటే ట్రంప్ పై అభిశంసన విచారణ వేసిన జ్యుడీషియల్ కమిటీలో ప్రమీల ఏకైక ఇండో అమెరికన్ మహిళ కావడం విశేషం.

తాజా వార్తలు