ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ లోకి వెళ్తాడా ...? ఆ మాటల అర్ధం ఏంటి...?     2019-01-11   22:30:20  IST  Sai Mallula

సినీ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ఆ ప్లాన్ తోనే వివాదాస్పద అంశాల మీద స్పందిస్తూ… వార్తల్లో నిలుస్తున్నాడు. తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయబోతున్నాను అని కూడా అయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశం రాజ్ మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు.అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన మాటలను బట్టి చూస్తే… మెల్లగా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపుతున్నారా? ఈ అంశం వరకే ఎఐసిసి అధినేత రాహుల్ గాందీకి మద్దతు ఇస్తున్నారా ? అన్నది తెలియదుకాని, మొత్తం మీద మహళలను అవమానించే విదంగ విధంగా…రాహుల్ మాట్లాడిన అంశంపై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది.

Prakshraj Try To Join Congress Party-

Prakshraj Try To Join Congress Party

రాహుల్ గాందీ మహిళలకు వ్యతిరేకం కాదని, విషయాన్ని రెండువైపులా చూడాలని సూచించారు.రాహు్ల్ పార్టీలో ఓ కీలక పదవిలో ట్రాన్స్‌జెండర్‌ను నియమించారు. ఎందుకు మీరు ఆయన వ్యాఖ్యలను ఒకే కోణంలో చూస్తున్నారు? ప్రధాని పార్లమెంట్‌కు రాని విషయం.. రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం నిజం కాదా? మనం ఆ కోణంలోనూ చూడాలి’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.