నేటితో మారనున్న తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం.. !

కలియుగ వైకుంఠంగా పిలవబడే తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి ఎందరో భక్తులు వస్తారన్న విషయం తెలిసిందే.ప్రశాంతమైన వాతావరణంలో సాక్షాత్తూగా స్వర్గానికే వెళ్లుతున్నామనే భావన కలిగేలా ఉన్న ఏడుకొండల ప్రయాణం భక్తుల మదిలో చిరకాలం నిలిచిపోతుందన్నది నిజం.

 Prakriti Siddha Naivedyam To Tirumala Tirupathi, Tirupathi Prasadam,tirumala, S-TeluguStop.com

ఇంతటి మహాన్వితం అయిన స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాయడంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేనిది.ఇకపోతే ప్రస్తుతం స్వామి వారికి నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ నేటి నుండి తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం మారనుందట.

కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయగా, నేడు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈమేరకు ఈరోజు నుండి దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా సాగు చేసిన బియ్యంతో వండిన నైవేద్యాన్ని, రోజుకో రకంతో ఏడాదంతా 365 రకాల బియ్యంతో చేసి స్వామివారికి నివేదించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube