అప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్.. నెట్టింట్లో ట్వీట్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

 Prakashraj Recalling 2004 Memories, Prakash Raj, Recall, Tweet Viral, Social Media-TeluguStop.com

ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకూ తెలుగులో విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

అంతే కాకుండా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగల నటుడు ప్రకాష్ రాజ్.ఇతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

 Prakashraj Recalling 2004 Memories, Prakash Raj, Recall, Tweet Viral, Social Media-అప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్.. నెట్టింట్లో ట్వీట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఇటీవలే మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ పేరు కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో మారు మోగిపోయిన విషయం తెలిసిందే.

ఇక మా ఎన్నికలలో హీరో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.రాజకీయ పరంగా అంతగా కలిసి రాలేక పోయినా నటుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ తాజాగా కొన్ని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ప్రకాష్ రాజ్ 2004లో నంది అవార్డును అందుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి తన పాత జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకున్నారు.ఇక ఆ ఫోటోలో ప్రకాష్ రాజ్ తో పాటుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, దాసరి నారాయణరావు ఉన్నారు.గుమ్మడి గారి ఆ స్పర్శ ఆహా అంటూ ఆ ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటోను చూసిన ప్రకాష్ అభిమానులు ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube