ప్రకాష్ రాజ్ పనికిమాలిన కుసంస్కారి.. నాగబాబు సంచలన కామెంట్స్..!  

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో యాక్టివ్ గా లేని ఆయన ఇదివరకు తాజాగా పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా పలు విమర్శనాస్త్రాలు గుప్పించారు.

TeluguStop.com - Prakash Raj Useless Kusanskari Nagababu Sensational Comments

ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను.పవన్ కళ్యాణ్ రోజుకు ఒక పార్టీ మార్చే ఊసరవెల్లి అని బీజేపీకి మద్దతు ఇవ్వాలి అంటే ఇక జనసేన ఎందుకు.? అవసరమైతే ఇంకొకరి భుజాన్ని ఎక్కి ఈ రాజకీయాలు చేయడం ఎందుకు.? అంటూ తెలుపుతూనే ప్రజలారా ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలి అంటూ కామెంట్స్ చేశారు.దీంతో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయ, సినీ వర్గాలలో కాస్త ప్రకంపనలు సృష్టించినట్లు అయింది.

ఇకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ మాటలు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ విధానాలను తప్పు పడుతూ ఉద్దేశించారు.

TeluguStop.com - ప్రకాష్ రాజ్ పనికిమాలిన కుసంస్కారి.. నాగబాబు సంచలన కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ సైనికులు ప్రకాష్ రాజ్ పై గుర్రుగా ఉన్నారు.వారు నటుడు ప్రకాష్ రాజ్ ను వివిధ రకాలుగా ట్రోల్ చేస్తుండగా.

మరోవైపు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపిన వారు కూడా చాలా మంది ఉన్నారు.తాజాగా ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడైన నాగబాబు ప్రకాష్ రాజ్ పై పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నాగబాబు ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ… ప్రకాష్ రాజ్ పనికిమాలిన కుసంస్కారి అంటూ, డబ్బు కోసం నిర్మాతలను హింసకు గురి చేస్తాడని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.వీటితో పాటు రాజకీయాల్లో నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అని ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్ టర్మ్ లో తమ పార్టీకి అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోబడతాయి అని తెలిపాడు.అంతేకాకుండా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి వారి గెలుపు కృషి చేయడం ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపాడు.

ఇక చివరగా ఎవరికి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని.

ప్రతి పనికిమాలినవాడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ, మిస్టర్ ప్రకాష్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో భారతీయ జనతా పార్టీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అందరికీ అర్థమైంది అంటూ ప్రకాష్ రాజ్ పై విమర్శల వర్షం కురిపించారు.భారతదేశానికి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీతో ఆంధ్రప్రదేశ్ కు జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అంటూ నాగబాబు తెలియజేశాడు.

#Prakash Raj #Politics #Pawan Kalyan #Nagababu #Cinima Industry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు