ఇది శాంపిల్ మాత్రమే అంటున్న ప్రకాష్ రాజ్..ఫొటోలతో రచ్చ!

Prakash Raj Tweet On Maa Elections Controversy

మా వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది.ఎలెక్షన్స్ ముగిసి పది రోజులు అవుతున్న ఈ వివాదాలు మాత్రం చల్లారడం లేదు.

 Prakash Raj Tweet On Maa Elections Controversy-TeluguStop.com

హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే ఎన్నికల ముందు ఎలా అయితే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అలానే ఆ గొడవలు ఆపడం లేదు.

ప్రకాష్ రాజ్ తో పాటు వారి ప్యానెల్ సభ్యులు కూడా ఏదొక వాదనతో ఇంకా వివాదం రాజేస్తూనే ఉన్నారు.ఈ వివాదాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి.ఎలెక్షన్స్ సమయంలో విష్ణు ప్యానెల్ జాబులు గుండాయిజం చేసారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ సిసి టీవీ ఫుటేజ్ అడిగారు.అయితే ఈ మ్యాటర్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యి సిసి టీవీ ఫుటేజ్ రూమ్ కు తాళం వేశారు.

 Prakash Raj Tweet On Maa Elections Controversy-ఇది శాంపిల్ మాత్రమే అంటున్న ప్రకాష్ రాజ్.. ఫొటోలతో రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రకాష్ రాజ్ సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వలేదని తాజాగా మరొక ట్వీట్ తో మన ముందుకు వచ్చాడు.ఎన్నికల సమయంలో ఎపి రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని.

ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్.ఈ విషయంపై కృష్ణ మోహన్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు.

అయితే తాజాగా ప్రకాష్ రాజ్ తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా కొన్ని ఫోటోలను షేర్ చేసాడు.ఫొటోలతో పాటు ప్రకాష్ రాజ్ కొద్దిగా మ్యాటర్ ను కూడా షేర్ చేసాడు.” మా ఎలెక్షన్స్ 2021.కృష్ణ మోహన్ గారు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.

సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వండి.ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేలా చేస్తాం.

ఎలెక్షన్స్ ఎలా జరిగాయి? జస్ట్ ఆస్కింగ్” అంటూ ఫోటోలు షేర్ చేసాడు.

ఇక ఆ ఫోటోల విషయానికి వస్తే.ఆ ఫొటోల్లో ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న రౌడీ షీటర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు పక్కనే ఉన్నట్టు ఈ ఫొటోల్లో కనిపిస్తుంది.ఎన్నికల్లో మాత్రమే కాదు మోహన్ బాబు కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక వీటితో పాటు జగన్ తో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసాడు.దీంతో ఈ వివాదంలోకి ఏపీ ని కూడా లాగారు.మరి చూడాలి అటు నుండి రిప్లై ఎలా వస్తుందో.

#RowdySheeter #Jagan #Prakashraaj #Krishna Mohan #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube