మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో పోటీ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ఇద్దరి ప్యానల్ మాకు మేము మంచి చేస్తామంటే మేము మంచి చేస్తామని అంటున్నారు.
ఇక వీరందరికి సెపరేట్ గా ఇండిపెండెంట్ గా బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు.ఆయన కూడా తన గెలుపు మీద నమ్మకంగా ఉన్నారు.
అక్టోబర్ 10న జరిగే మా ఎలక్షన్స్ సందర్భంగా రోజుకొక ప్రెస్ మీట్ తో ఇరు ప్యానల్ సభ్యులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బుధవారం మంచు విష్ణు ప్యానల్ ను సపోర్ట్ చేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ టార్గెట్ తో నరేష్ చాలా కామెంట్స్ చేశారు.ప్రెస్ మీట్ అనంతరం ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ద్వారా ఒక కామెంట్ చేశారు.యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్.‘మా’ హితమే మా అభిమతం మనస్సాక్షిగా ఓటేద్దాం.మా ఆశయాలను గెలిపిద్దాం.అని ట్వీట్ చేశారు.తన ప్యానల్ సభ్యుల ఫోటోలతో ట్వీట్ చేశారు.ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ కు రీ ట్వీట్ చేస్తూ జనరల్ సెక్రటరీగా వేసే ఓటుని మాత్రం బండ్ల గణేష్ కు వేయండి అని ట్వీట్ చేశారు.