మా అసోసియేషన్ అధ్యక్ష రేసులో ప్రకాష్ రాజ్

టాలీవుడ్ లో మా అసోసియేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.మూవీ ఆర్టిస్ట్ అందరు కూడా ఆ అసోసియేషన్ లో భాగమై ఉంటారు.

 Prakash Raj To Contest For Maa Elections-TeluguStop.com

ప్రతి రెండేళ్లకు ఒకసారి మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి.అయితే గతంలో మా అసోసియేషన్ అధ్యక్ష పదవి వీలైనంత వరకు ఏకగ్రీవంగా జరిగేది.

కానీ గత సీజన్లో పోటీ నెలకొంది.శివాజీ రాజా, నరేష్ వర్గాల మధ్య మా అధ్యక్ష పదవి కోసం పోటీ ఏర్పడింది.

 Prakash Raj To Contest For Maa Elections-మా అసోసియేషన్ అధ్యక్ష రేసులో ప్రకాష్ రాజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోటీలో నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి మా అధ్యక్ష రేసులో తాను పోటీకి దిగుతున్నట్లు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

గతంలోనే ఈ విషయాన్ని ఒకసారి వకీల్ సాబ్ ప్రమోషన్ లో భాగంగా ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
మరోసారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

మా అసోసియేషన్ అధ్యక్షుడుగా తాను ఎన్నికైతే వందకు వందశాతం ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే ఈసారి మా అసోసియేషన్ పోటీల్లో చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉండబోతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

మెగాస్టార్ సపోర్టు తోనే ప్రకాష్ రాజ్ ఈ సారీ పోటీలో దిగడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

చిరంజీవి అందరివాడు అని, అతనిని ఒక వర్గానికే పరిమితం చేయడం కరెక్ట్ కాదని చెప్పుకోచాడు.అయితే అన్నయ్య ఆశీర్వాదం తనకి లభిస్తుందని భావిస్తున్నా అంటూ అన్నాడు.

మరి ప్రకాష్ రాజ్ కి పోటీగా ఈసారి బరిలో ఎవరు నిలబడతారని ఆసక్తికరంగా మారింది.

#Naresh #Prakash Raj #Shivaji Raja #MAA Elections #MovieArtist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు