మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ​ఎన్నికలు రద్దు.. ప్రకాష్ రాజ్ ప్లాన్ ఇదేనా?

Prakash Raj Team Is Going To Ther Court To Cancel Movie Artist Association Election

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాష్ రాజ్, అతని ప్యానల్ సభ్యులు విష్ణుకు వరుసగా షాకులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరోహోరీగా జరగగా విష్ణు 107 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 Prakash Raj Team Is Going To Ther Court To Cancel Movie Artist Association Election-TeluguStop.com

ఎన్నికల ఫలితాలు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను తీవ్రంగా నిరాశపరిచాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.అనంతరం ప్రకాష్ రాజ్ తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులతో రాజీనామాలు చేయించి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

 Prakash Raj Team Is Going To Ther Court To Cancel Movie Artist Association Election-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ​ఎన్నికలు రద్దు.. ప్రకాష్ రాజ్ ప్లాన్ ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని ఎన్నికల అధికారిని కోరిన సంగతి తెలిసిందే.ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లాలనే ఆలోచనతో సీసీ టీవీ ఫుటేజీ అడిగారని తెలుస్తోంది.

అయితే ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్లడం ద్వారా ఎన్నికలు రద్దు చేయించే ఛాన్స్ కూడా ఉందని సమాచారం.

ఎన్నికల అధికారి సైతం ప్రకాష్ రాజ్ కు సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వడానికి అంగీకరించడంతో విష్ణుకు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Cctv Footage, Chiranjeevi, Maa, Manchu Vishnu, Prakash Raj, Prakash Raj, Tollywood-Movie

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రద్దు అయితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.మరోవైపు మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.900 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల, ఎన్నికల ఫలితాల విషయంలో ఊహించని స్థాయిలో వివాదాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.

Telugu Cctv Footage, Chiranjeevi, Maa, Manchu Vishnu, Prakash Raj, Prakash Raj, Tollywood-Movie

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి చల్లారకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

#Cctv Footage #Prakash Raj #Maa #Prakash Raj #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube