పవన్ ఓడినా నిలబడ్డారు.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..?

వకీల్ సాబ్ సినిమాలో నందా అనే లాయర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రకాష్ రాజ్ మెప్పించిన సంగతి తెలిసిందే.వకీల్ సాబ్ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడానికి ప్రకాష్ రాజ్ చేసిన లాయర్ పాత్ర కూడా కారణమని చెప్పవచ్చు.

 Prakash Raj Shocking Comments About Pawan Kalyan Political Career-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కు, ప్రకాష్ రాజ్ కు రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ సినిమాలపరంగా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కలిసే పని చేస్తారు.తాజాగా పవన్ కళ్యాణ్ గురించి, వకీల్ సాబ్ సినిమా గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో తను, పవన్ కళ్యాణ్ కలిసి బద్రి అనే సినిమాలో నటించామని దర్శకుడు ఈ సినిమాలోని పాత్రకు కావాలనే నందా అని పెట్టారని ప్రకాష్ రాజ్ చెప్పారు.దర్శకుడు శ్రీరామ్ వేణు కోర్టు రూమ్ లో తెరకెక్కిన సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రకాష్ రాజ్ అన్నారు.

 Prakash Raj Shocking Comments About Pawan Kalyan Political Career-పవన్ ఓడినా నిలబడ్డారు.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వకీల్ సాబ్ మూవీ పవన్ ఆలోచనలకు దగ్గరైన మూవీ అని పవన్ కళ్యాణ్ మనస్సులో నుంచి కొన్ని సంభాషణలు వచ్చాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా తెరకెక్కిందని ఉదయం ఏడున్నర గంటల సమయంలోనే పవన్ సెట్ కు వచ్చేవారని ప్రకాష్ రాజ్ తెలిపారు.నిర్మాతగా తాను చిన్న సినిమాలను, సంతృప్తినిచ్చే సినిమాలను నిర్మిస్తున్నానని వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలను నిర్మించడం తన వల్ల కాదని ప్రకాష్ రాజ్ అన్నారు.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఓడిపోయినా నిలబడ్డారని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఓడిపోయినా నిలబడటం పవన్ లో ఉన్న గొప్ప రాజకీయ లక్షణమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.పురుషులలో మార్పు రావాలని మహిళలకు సంబంధించి ఇంకా మంచి సినిమాలు రావాలని తాను కోరుకుంటున్నానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

#Vakeel Saab #Prakash Raj #PavanPolitical

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు