నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. మీ భాష రాదంటూ..?  

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయిద్దామని భావించినా కొన్ని కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.దీంతో పవన్ కళ్యాణ్ ఊసరవెళ్లి అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

TeluguStop.com - Prakash Raj Sensational Comments About Nagababu

అయితే ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలపై పవన్ స్పందించకపోయినా ఆయన సోదరుడు నాగబాబు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ప్రకాశ్ రాజ్ దర్శకులను కాకా పట్టి అవకాశాలు సంపాదించుకుంటారని.

TeluguStop.com - నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. మీ భాష రాదంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నిర్మాతలను డబ్బు కోసం టార్చర్ చేస్తారని నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రకాశ్ రాజ్ చరిత్ర తనకు తెలుసంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

ప్రకాశ్ రాజ్ మొదట మంచి మనిషిగా మారాలని ఆ తరువాత మాట్లాడాలని నాగబాబు సూచనలు చేశారు.అయితే తనపై నాగబాబు చేసిన విమర్శల గురించి ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ మాటల యుద్ధానికి తెర లేపారు.

నాగబాబు గారికి తమ్ముడు పవన్ కళ్యాణ్ పైన ఉన్న ప్రేమ తనకు అర్థమైందని.తనకు దేశంపై ఉన్న ప్రేమను నాగబాబు అర్థం చేసుకోవాలంటూ సింపుల్ గా కౌంటర్ వేశారు.తనకు తెలుగు భాష వచ్చని అయితే నాగబాబు గారు మాట్లాడే భాష మాత్రం తనకు రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్ల గురించి నాగబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు సినీ నటుల మధ్య విభేదాలకు కారణమయ్యాయి.నాగబాబు, ప్రకాశ్ రాజ్ ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకోవడంతో ఎవరో ఒకరు రంగంలోకి దిగి ఈ వివాదానికి తెర దించితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో కొందరు నాగబాబుకు మద్దతు పలుకుతుంటే మరి కొందరు ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతుండటం గమనార్హం.

#StrongCounter #Pawan Kalyan #Prakash Raj #GHMC Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు