మరొక మలుపు తిరిగిన 'మా' వివాదం.. సిసిటివి ఫుటేజ్ ఇవ్వలేమంటూ..!

Prakash Raj Seeks Cctv Footag Of Maa Polling Day

మా ఎలెక్షన్స్ ముగిసిన ఇంకా అభ్యర్థుల మధ్య వేడి మాత్రం తగ్గలేదు.రోజు ఏదొక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు.

 Prakash Raj Seeks Cctv Footag Of Maa Polling Day-TeluguStop.com

గత వారం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.ఎప్పుడు టాలీవుడ్ లో మా ఎన్నికలకు ఇంత గొడవలు జరగలేదు.

ఇప్పుడు మొదటి సారి ఇద్దరు సత్తా ఉన్న అభ్యర్థులు బరిలోకి దిగడంతో వాదనలు ప్రతివాదనలతో టాలీవుడ్ ను వార్తల్లో నిలబెట్టారు.

 Prakash Raj Seeks Cctv Footag Of Maa Polling Day-మరొక మలుపు తిరిగిన మా’ వివాదం.. సిసిటివి ఫుటేజ్ ఇవ్వలేమంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత హీట్ పెంచేసిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిపొందారు.

వారం క్రితం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవిని చేపట్టిన మంచు విష్ణు నిన్న ప్రమాణ స్వీకారం చేసారు.అయితే ఎలెక్షన్స్ ముగిసిన కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎన్నికల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అందుకే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు.ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసారు.

పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్ గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ సిసి టీవీ ఫుటేజ్ కావాలని ఒక లేఖను రాసారు.

Telugu Cctv Footag, Maa Elections Results, Maa New President Manchu Vishnu, Mohan Babu, Prakash Raj, Prakash Raj Resigns To Maa, Prakash Raj Seeks Cctv Footag Of Maa Polling Day, Prakash Raj Tweet, Tollywood-Movie

మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులు మాట్లాడుతూ తమపై దాడి చేసారని అందుకే ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ను కోరారు.

Telugu Cctv Footag, Maa Elections Results, Maa New President Manchu Vishnu, Mohan Babu, Prakash Raj, Prakash Raj Resigns To Maa, Prakash Raj Seeks Cctv Footag Of Maa Polling Day, Prakash Raj Tweet, Tollywood-Movie

అయితే ముందు కృష్ణ మోహన్ ఫుటేజ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు.దీంతో ఈ వివాదం మళ్ళీ వేడి రాజుకుంది.ఇలా వివాదం జరగడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగ ప్రవేశం చేసారు.

సిసి టీవీ ఫుటేజ్ ను పోలీసులు చెక్ చేసారు.ప్రకాష్ రాజ్ సిసి టివి ఫుటేజ్ మాయం చేసే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి టీవీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు.

దీంతో మా వివాదం మరొక మలుపు తిరిగింది.

#MAA #PrakashRaj #PrakashRaj #Prakash Raj #CCTV Footag

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube