నోటిదూలతో కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడా, బ్యాన్‌ తప్పదేమో

తెలుగుతో పాటు పలు భాషల్లో విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు దక్కించుకున్న విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌.ఈయన సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడు రాజకీయాలు కూడా చేస్తూ ఉంటాడు.

 Prakash Raj Ruining A Cinima Career With Mouths-TeluguStop.com

ఈయన దుడుకు స్వభావం వల్ల పలు సినిమాలను పోగొట్టుకున్నాడు.బీజేపీకి చాలా వ్యతిరేకంగా ఉండే ఈయన ఆమద్య సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి నిరాశ పడ్డాడు.

Telugu Kannada, Prakash Raj, Prakashraj-

ఇటీవల ఒక టీవీ చర్చ కార్యక్రమంలో హిందూ కార్యక్రమాలు అంటూ చెబుతూ ముంబయి మోడల్స్‌కు వేశాలు వేసి వారిని పూజించడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.వేశాలు వేసుకునే వారికి ఐఏఎస్‌లు చేతులు ఎత్తి నమస్కరించడం వల్ల భారత దేశం భవిష్యత్తు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని, హిందుత్వం పేరుతో మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ప్రకాష్‌ రాజ్‌ ఆరోపించాడు.

Telugu Kannada, Prakash Raj, Prakashraj-

ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై హిందూ మహాసభ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.కన్నడ హిందూ మహాసభ కన్నడ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రకాష్‌ రాజ్‌ను బ్యాన్‌ చేయాలంటూ ఫిర్యాదు చేసింది.హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన ప్రకాష్‌ రాజ్‌ను కన్నడ సినిమాల్లో కి తీసుకుంటే ఉద్యమం ఉదృతం చేసి ఆయన నటించిన, నటించబోతున్న సినిమాలు ప్రసారం కాకుండా, విడుదల కాకుండా చేస్తామంటూ హెచ్చరించారు.

అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కనుక హిందూ మహాసభల డిమాండ్‌కు ప్రభుత్వం ఓకే చెప్పే అవకాశం ఉందని, దాంతో కన్నడ సినిమా పరిశ్రమలో ఆయన కెరీర్‌ ఖతం అయినట్లే అంటూ ప్రచారం జరుగుతోంది.కాస్త నోరును అదుపులో ఉంచుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ ఆయన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube