బాలయ్య ఈగో అవసరం లేదన్న ప్రకాష్ రాజ్  

Prakash Raj Response On Balakrishna Comments Ccc - Telugu Balakrishna, Chiranjeevi, Naga Babu, Prakash Raj, Prakash Raj About Balakrishna Comments, Tollywood News

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో అన్ని రంగాలు స్తంభించిపోయాయి.ఈ క్రమంలో సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడటంతో పేద సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Prakash Raj Response On Balakrishna Comments Ccc

అయితే ప్రస్తుతం పలు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉండటంతో సినిమా షూటింగ్‌లకు అనుమతిని కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రభుత్వ అధికారులతో చర్చించారు.

ఈ చర్చలు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన జరగగా, పలువురు దర్శకనిర్మాతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

బాలయ్య ఈగో అవసరం లేదన్న ప్రకాష్ రాజ్-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఈ చర్చలకు సంబంధించి తనను ఎవరూ పిలవలేదని నందమూరి బాలకృష్ణ అనడంతో ఇప్పుడు ఇది టాలీవుడ్‌లో వివాదాస్పదంగా మారింది.బాలయ్యకు కౌంటర్‌గా చిరు సోదరుడు నాగబాబు కూడా పలు ఘాటైన కామెంట్లు చేశాడు.

అయితే ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించాడు.సినిమా ఇండస్ట్రీకి చెందిన సమావేశాలకు తనను పిలవకపోతే ఇంత బాధపడాల్సిన అవసరం లేదని, బాలయ్య తన ఈగో చూపించకుండా ఉండాల్సింది అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.చిరంజీవికి అనుకూలంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని, బాలయ్య అన్నదాంట్లో తప్పేముంది అంటూ ఆయన ఫ్యా్న్స్ ప్రకాష్ రాజ్‌పై మండిపడుతున్నారు.

ఏదేమైనా మరోసారి ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prakash Raj Response On Balakrishna Comments Ccc Related Telugu News,Photos/Pics,Images..

footer-test