పవన్ కు సిగ్గు ఎక్కువ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో వకీల్ సాబ్ కు పోటీనిచ్చే మరో సినిమా థియేటర్లలో లేదు.వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ లాయర్ నందా పాత్రలో నటించి మెప్పించారు.

 Prakash Raj Interesting Comments About Pawan Kalyan-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ తాను కలిసి నటించిన తొలి సినిమా బద్రి అని ఆ సినిమాలోని డైలాగ్ వల్ల మా కాంబినేషన్ కు మంచి పేరు వచ్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

 Prakash Raj Interesting Comments About Pawan Kalyan-పవన్ కు సిగ్గు ఎక్కువ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బద్రి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో నటించానని అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా మారారని ప్రకాష్ రాజ్ తెలిపారు.పవన్ కళ్యాణ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో ఎక్కువగా సిగ్గు పడేవారని ప్రకాష్ రాజ్ అన్నారు.

Telugu Actor Prakash Raj, Interesting Comments, Lawyer Nanda Role, Pavan Kalyan-Movie

వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్ల గురించి మాట్లాడుతూ ఆ సీన్లు షూటింగ్ చేసేముందు పవన్ తో చర్చించేవాడినని ప్రకాష్ రాజ్ చెప్పారు.పవన్ తో సినిమాల్లో నటించిన వాళ్లంతా అద్భుతంగా నటించారని అలా నటించడం వల్లే వకీల్ సాబ్ సినిమా మంచి ఫలితాన్ని అందుకుందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.వకీల్ సాబ్ సినిమా కోర్టు సన్నివేశాలు అద్భుతంగా రావడం విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు కూడా క్రెడిట్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ అన్నారు.

సినిమాలలో తాను నటించే సమయంలో నా పాత్రతో కథను బాగా చెప్పానో లేదో అనే విషయం మాత్రమే ఆలోచిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.

వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ సహజంగా మాట్లాడారని సమాజంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాన్ని సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడని తెలిపారు.

#Pavan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు