పవన్ ఇష్టమంటున్న ప్రకాశ్ రాజ్.. ట్విస్ట్ ఏంటంటే..?  

రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు టాలీవుడ్ సినీ నటుల మధ్య మాటల యుద్ధానికి కారణమైన సంగతి తెలిసిందే.ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం, ఆ విమర్శలకు నాగబాబు కౌంటర్ ఇవ్వడం, ప్రకాశ్ రాజ్ మళ్లీ ట్విట్టర్ ద్వారా నాగబాబుపై విమర్శలు చేయడం తెలిసిందే.

TeluguStop.com - Prakash Raj Interesting Comments About Pawan Kalyan

అయితే ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసిన అనంతరం ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తానని సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రకాశ్ రాజ్ అన్నారు.

TeluguStop.com - పవన్ ఇష్టమంటున్న ప్రకాశ్ రాజ్.. ట్విస్ట్ ఏంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే రాజకీయాల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తనకు నచ్చడని తెలిపారు.పవన్ పై చేసిన కామెంట్ల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని కానీ రాజకీయాల పరంగా మాత్రమే అభిప్రాయ భేదాలు ఉన్నాయని తెలిపారు.

Telugu Janasena Bjp, Pawan Kalyan, Prakash Raj Interesting Comments, Vakeel Saab Movie-Movie

పవన్ సిద్ధాంతాలు తనకు నచ్చవని ప్రకాశ్ రాజ్ అన్నారు.కొంతమంది స్టార్ హీరోలతో తనకు విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని.అయితే తాను ఆ హీరోలతోనే పని చేస్తున్నానని అన్నారు.

తనకు, పవన్ కళ్యాణ్ కు మధ్య గొడవ జరుగుతుందని అందరూ అనుకుంటున్నారని కానీ పవన్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో తాను ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నానని వెల్లడించారు.

రాజకీయపరమైన గొడవలను, వృత్తిపరమైన జీవితంలోకి తీసుకొని రానని షూటింగ్ గ్యాప్ లో కూడా రాజకీయాల గురించి చర్చించుకుంటామని.

పవన్ కు, తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.పవన్ కు కూడా రాజకీయపరంగా అభిప్రాయ బేధాలు ఉన్నట్టు తాను చెప్పానని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

ప్రకాశ్ రాజ్ కామెంట్లపై నాగబాబు స్పందించకపోవడంతో పవన్ – ప్రకాశ్ రాజ్ – నాగబాబు మధ్య వివాదానికి తెర పడినట్లే అని చెప్పవచ్చు.

#Janasena BJP #PrakashRaj #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు