మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు.ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ప్రకాష్ రాజ్ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Prakash Raj Got Marriage Once Again For His Son Vedanth , Got Marrege , For His-TeluguStop.com

ఈ నటుడి ప్రతిభకు ఇప్పటికే ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.పలు సందర్భాల్లో ప్రకాష్ రాజ్ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా కొంతమంది దర్శకులు కేవలం ప్రకాష్ రాజ్ కోసమే పాత్రలను క్రియేట్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ప్రకాష్ రాజ్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.మొదటి భార్య పేరు లలితకుమారి కాగా రెండో భార్య పేరు పోనీవర్మ.ప్రకాష్ రాజ్ కు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.అయితే తాజాగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని చెప్పారు.

కొడుకు తల్లీతండ్రి పెళ్లి వేడుకను చూడాలని కోరగా కొడుకు కోరికను తీర్చాలని ప్రకాష్ రాజ్ ఈ పని చేశారు.

Telugu Son Vedanth, Maa, Prakash Raj, Tollywood-Movie

ప్రకాష్ రాజ్ చేసిన సరదా పని నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.ఈ వేడుకకు తన మొదటి భార్యతో పాటు పిల్లలను కూడా ప్రకాష్ రాజ్ ఆహ్వానించారు.తన పెళ్లి రోజు వేడుకలను ప్రకాష్ రాజ్ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు.

తన పెళ్లికి కొడుకు సాక్ష్యంగా ఉండాలని అనుకున్నాడని అందువల్లే మళ్లీ పెళ్లి చేసుకున్నామని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

Telugu Son Vedanth, Maa, Prakash Raj, Tollywood-Movie

ఉత్తుత్తి పెళ్లి చేసుకుని ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలవగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.కొన్ని రోజుల క్రితం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube