అర్జున్‌ మంచోడే.. ప్రకాష్‌ రాజ్‌ మాట మార్చేశాడు  

కన్నడ స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అర్జున్‌ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడా లేదా అనే విషయం నిర్థారణ కాకుండానే కొందరు కన్నడ సినీ ప్రముఖులు అర్జున్‌ను సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు. అందులో ప్రకాష్‌ రాజ్‌ కూడా ఉన్నాడు. అర్జున్‌ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన సారీ చెప్పాల్సిందే అని, తాను శృతికి మద్దతుగా నిలుస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాని ఇప్పుడు అదే ప్రకాష్‌ రాజ్‌ మాట మార్చాడు.

Prakash Raj Gives A Twist About Hero Arjun-

Prakash Raj Gives A Twist About Hero Arjun

అర్జున్‌కు పెద్ద ఎత్తున కన్నడ సినిమా పరిశ్రమ నుండి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో, అంతా కూడా అర్జున్‌ వైపు నిలుస్తున్న ఈ సమయంలో తాను కూడా అర్జున్‌కే మద్దతు అంటూ ప్రకాష్‌ రాజ్‌ ప్లేట్‌ ఫిరాయించాడు. తాను గతంలో అర్జున్‌ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అని అనలేదు. ఒక అమ్మాయి లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న క్రమంలో వాటిపై స్పందించాలని తాను అన్నాను తప్ప అర్జున్‌ గురించి తప్పుగా మాట్లాడలేదని, ఆయన్ను నేను ఎప్పుడు చెడ్డ వ్యక్తి అంటూ అనలేదని ప్రకాష్‌ రాజ్‌ అన్నాడు.

Prakash Raj Gives A Twist About Hero Arjun-

అర్జున్‌ నాకు చాలా కాలంగా మిత్రుడు, ఇద్దరం సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాం. ఇద్దరం కూడా ఇండస్ట్రీలో మంచి మిత్రులం. అలాంటి సమయంలో నేను ఆయన గురించి ఎలా తప్పుగా మాట్లాడతాను, ఆయన నాకు పూర్తిగా తెలుసు కనుక లైంగిక వేదింపుల ఆరోపణలకు మద్యవర్థిత్వం చేయాలని భావించాను అంటూ ప్రకాష్‌ రాజ్‌ పేర్కొన్నాడు. మొత్తానికి ప్రకాష్‌ రాజ్‌ వారం రోజుల్లో మాట మార్చి అందరికి షాక్‌ ఇచ్చాడు.