పేద కుటుంబానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏం చేశారంటే?

నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.భాషతో సంబంధం లేకుండా ఎన్నో విలక్షణమైన పాత్రలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రకాష్ రాజ్ వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 Prakash Raj Gifts A Jcb To Family In Karnataka-TeluguStop.com

తాజాగా ప్రకాష్ రాజ్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.పేద కుటుంబానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలిచారు.

ఒక పేద కుటుంబానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Prakash Raj Gifts A Jcb To Family In Karnataka-పేద కుటుంబానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న పేద కుటుంబానికి ప్రకాష్ రాజ్ జేసీబీని గిఫ్ట్ గా ఇచ్చారు.

ఈ పని ద్వారా ఆ కుటుంబ సభ్యుల జీవితంలోకి ఆనందాన్ని తెచ్చామని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.ప్రకాష్ రాజ్ ను నెటిజన్లు ప్రశంసిస్తూ పేదరికం వల్ల కష్టాలు పడుతున్న మరి కొంతమందికి కూడా ఇదే విధంగా ప్రకాష్ రాజ్ సహాయం చేయాలని సూచనలు చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ చేసిన మంచి పనిని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ గత నెలరోజుల నుంచి ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

Telugu Babu Mohan, Bandla Ganesh, Gifts A Jcb, Hema, Interesting Facts, Jeevitha Rajasekhar, Karnataka, Maa Elections, Manchu Vishnu, Mysore, Poor Family, Prakash Raj, Prakash Raj Panel-Movie

హేమ, జీవితా రాజశేఖర్ లను తన ప్యానల్ లో చేర్చుకుని ప్రకాష్ రాజ్ అందరినీ ఆశ్చర్యపరిచారు.అక్టోబర్ నెలలో జరగబోయే ఎన్నికలపై ఆసక్తి నెలకొనగా ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో తెలియాల్సి ఉంది.విష్ణు ఎన్నికల్లో విజయం సాధించేలా భారీగా ప్రణాళికలను తయారు చేసుకుంటున్నారు.

Telugu Babu Mohan, Bandla Ganesh, Gifts A Jcb, Hema, Interesting Facts, Jeevitha Rajasekhar, Karnataka, Maa Elections, Manchu Vishnu, Mysore, Poor Family, Prakash Raj, Prakash Raj Panel-Movie

బండ్ల గణేష్, బాబు మోహన్ ఇతర పదవులకు పోటీ చేస్తామని ప్రకటించగా వాళ్లు ఏదైనా ప్యానల్ నుంచి పోటీ చేస్తారా.? లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.మరోవైపు ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

#Babu Mohan #Prakash Raj #Bandla Ganesh #Manchu Vishnu #Mysore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు