సైలెంట్ గా కానిచ్చేసిన ప్రకాశ్ రాజ్..!

సౌత్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మంచి క్రేజ్ సంపాదించిన ప్రకాశ్ రాజ్ కొద్దికాలం నుండి వేరే హీరోల సినిమాల్లో నటించడం తగ్గించి సొంత బ్యానర్లో సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.ప్రకాశ్ రాజ్ కోసం క్యారక్టర్ రాసుకుని వెళ్తే తప్ప ఆయనంతట ఆయన వచ్చి సినిమాలు చేసే ఆలోచన మానేశాడు.

 Prakash Raj Directorial ‘mana Oori Ramayanam’ Completed-TeluguStop.com

ఇక ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో ప్రకాశ్ రాజ్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటిస్తున్న సినిమా ‘మన ఊరి రామాయణం’.

అంతా తానై నడిపిస్తున్న ఈ సినిమాను ఎలాంటి హడావిడి లేకుండా పూర్తి చేశాడట ప్రకాశ్ రాజ్.

సినిమా మొదలైనప్పుడు రిలీజ్ చేసిన ఓ పోస్టర్ తప్ప మిగతా విషయాలేవి తెలియదు.మరి ఇలా అయితే సినిమా గురించి ఆడియెన్స్ కు ఎలా తెలిసేది అంటే.

ఏం మాట్లాడట్లేదు ప్రకాశ్ రాజ్.కాన్సెప్ట్ ఓరియెటెడ్ సినిమా చేయడం మంచి పనే కాని దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేలా కాస్త ప్రమోషన్స్ కూడా చేస్తే ఇంకాస్త ఎక్కువ ఉపయోగం ఉంటుంది కదా అని కొందరి సలహా.

టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఇలా ఏదో ఒక సందర్భంలో సినిమా గురించి నలుగురు మాట్లాడేలా చేస్తేనే ఈరోజుల్లో సినిమాకు ఓపెనింగ్స్ రాబట్ట గలుగుతారు.మరి ఈ అంశాలు ప్రకాశ్ రాజ్ కు తెలియక కాదు కాని ఎందుకో మరి వెనుకడుగు వేస్తున్నాడో తెలియదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube