ఇరికిద్దామ‌నుకోని ఇరుక్కుపోయాడు..! చివరికి 5 కోట్ల పరువునష్టం దావా..! ఇప్పుడు కాళ్ళ బేరానికి వ‌చ్చి మాట మార్చాడు.!  

Prakash Raj Changes His Words On Arjun-

నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఆరోపణలు అర్జున్, అతడి కుటుంబంతో పాటు కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అర్జున్ జెంటిల్మెన్ అంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు..

ఇరికిద్దామ‌నుకోని ఇరుక్కుపోయాడు..! చివరికి 5 కోట్ల పరువునష్టం దావా..! ఇప్పుడు కాళ్ళ బేరానికి వ‌చ్చి మాట మార్చాడు.!-Prakash Raj Changes His Words On Arjun

ప్రకాష్ రాజ్, శ్రద్ధాశ్రీనాథ్ వంటి తారలు మాత్రం శ్రుతికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అర్జున్, శ్రుతిలని పిలిచారు. ఈ సమావేశం మొదలుకావాడానికి కొన్ని గంటల ముందే అర్జున్ తరఫున అతని మేనల్లుడు ధ్రువ బెంగుళూరు సివిల్ న్యాయస్థానంలో శ్రుతిపై రూ.

5 కోట్ల పరువునష్టం దావా వేశారు. అర్జున్. శ్రుతి తనకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు..

దీనిపై స్పందించిన శ్రుతి… తాను క్షమాపణలు చెప్పనని, ఎప్పటికీ తన మాట మీదే నిలబడి ఉంటానని స్పష్టం చేసింది.

అయితే ఈ ఆరోపణల విషయంలో ఇప్పటివరకు శ్రుతికి సపోర్ట్ చేస్తూ వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మాట మార్చాడు. అర్జున్ నిందితుడంటూ తాను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ప్రకాష్ రాజు. మొదట అర్జున్ అలా చేసే ఉంటాడని, క్షమాపణలు చెబితే సరిపోతుందని కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు అసలు తను అలా అనలేదని అనడం గమనార్హం.