'మా'కు పోటీగా ప్రకాశ్‌రాజ్ మరో అసోసియేషన్‌?

గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.ఎన్నో విమర్శలు మాటలు తర్వాత జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.

 Maa Elections, Maa Assiocation, Prakash Raj, Maa Competition,latest News-TeluguStop.com

ఇదిలా ఉండగా మంచు ప్యానల్ ప్రకాష్ రాజ్ పై అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మెగా కుటుంబం మద్దతు తెలిపినప్పటికీ ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఇలా మా ఎన్నికలలో ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ కు రాజీనామా చేశారు.ప్రకాష్ రాజ్ తో పాటు నాగబాబు శివాజీ రాజా కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణం ఏంటి త్వరలోనే ఆ బాంబు బ్లాస్ట్ చేస్తానని చెప్పారు.అనుకున్న విధంగానే ప్రకాష్ రాజ్ నేడు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం.

Telugu Maa, Prakash Raj-Movie

ఈ మీడియా సమావేశంలో భాగంగా ప్రకాష్ రాజ్ “మా” మరొక అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొంత మంది సభ్యులను ఏర్పాటు చేసుకొని మరొక అసోసియేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.ఇప్పటికే మా సభ్యత్వం నుంచి పలువురు రాజీనామాలు చేయడం మరికొందరు కూడా రాజీనామా బాటలోనే ఉండడంతో అందరూ రాజీనామా చేస్తూ వెళితే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారు.మరి నిజంగానే ప్రకాష్ రాజ్ మరొక అసోసియేషన్ ఏర్పాటు చేయనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube