వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్..

ఏ పాత్ర ఇచ్చినా.అందులో ఒదిగిపోయి నటించే వ్యక్తి ప్రకాష్ రాజ్.

 Prakash Raj Acted As Father For Aged Heros-TeluguStop.com

తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన మేలిమి మేటి నటుడు ఆయన.తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు.అయితే ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయగల వ్యక్తి.అయితే తన కెరీర్ లో తన కంటే వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించడం విశేషం.

ఆయన తన సహజ నటనతో ఎందరి చేతనో ప్రశంసలు దక్కించుకున్నాడు.ఇంతకీ తను తండ్రిగా నటించిన వయసులో పెద్ద హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Prakash Raj Acted As Father For Aged Heros-వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతపురం సినిమాలో సాయి కుమార్ కు తండ్రిగా నటించాడు ప్రకాష్ రాజ్ .నిజానికి సాయి కుమార్ కంటే ప్రకాష్ రాజ్ చిన్నవాడు.కానీ తనకు తండ్రిగా చేశాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో తన కంటే వయసులో పెద్దవాడైన వెంకటేష్ కు తండ్రిగా యాక్ట్ చేశాడు.అటు వయసు తక్కువా? ఎక్కువా? అని చూడడు ప్రకాష్ రాజ్.పాత్ర ప్రాధాన్యత మాత్రమే చూస్తాడు.అందుకే తన కంటే వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించాడు.

అటు ప్రకాష్ రాజ్ పై సినిమా పరిశ్రమలో ఓ రూమర్ ఉంది.ఆయన షూటింగ్ కు సమయానికి రారని నిర్మాతలను వేధిస్తాడని ఓ ఆరోపణ ఉంది.కానీ నటన విషయంలో  ఆయనకు వంక పెట్టలేం.అందుకే ఆయనకు తెలుగు సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు వచ్చాయి.వాటిని కచ్చితమైన పద్దతిలో వాడుకుంటూ నటుడుగా పైపైకి ఎదిగాడు.

తాజాగా జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేసి ఓడిపోయాడు.అయినా సినిమాల విషయంలో మాత్రం తను మంచి స్వింగ్ లో కొనసాగుతున్నాడు.తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ సినిమా పరిశ్రమలోనూ రాణిస్తున్నాడు.

అందరి చేత చక్కటి ప్రశంసలు అందుకుంటున్నాడు.

#Ravi Teja #Prakash Raj #Venkatesh #Sai Kumar #Maaa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube