చంద్రబాబు ఊహించని పరిణామం..వైసీపిలోకి కీలక నేత

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి ముందు ముందు భారీ షాకులు తగలనున్నాయి అంటున్నారు విశ్లేషకులు.తెలుగుదేశం పార్టీ పై తన సొంత పార్టీ నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వారు కర్ణాటక ఎన్నికల రిజల్స్ తరువాత వెళ్లిపోతారని అంటున్నారు.

 Prakasam District Tdp Senior Leader Jump Into Ysrcp-TeluguStop.com

అయితే ఈ విషయంలో ఒక ఖచ్చితమైన సమాచారం మాత్రం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే బీజేపి , వైసీపి నేతలు మే 15 తరువాత కీలకమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో కాస్తో కూస్తో ఉప్పందుకున్న నేతలు మెల్లగా పెట్టె బేడా సర్దుకుంటున్నారు.

ఈకమంలోనే తెలుగుదేశం పార్టీ కి అంతగా పట్టులేని జిల్లా అయిన ప్రకాశం నుంచీ చంద్రబాబు కి భారీ షాక్ ఇవ్వబోతునారట ఒక కీలక నేత.గత ఎన్నికల ముందు పార్టీ లో చేరిన ఓ కీలక నేత ఇప్పుడు పార్టీ ని వీడి వైసీపి లోకి వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారట.అంతేకాదు జగన్ దగ్గర ఒంగోలు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు మాట కూడా తీసుకున్నారని తెలుస్తోంది.ఒంగోలులో మూడుసార్లు ఎంపీగా పని చేసిన అనుభవం ఉండటంతో వైసీపి ఆ నేతకి గేలం వేసిందని దాంతో సదరు నేత టీడీపీ ని వీడి వైసీపిలోకి వెళ్ళారని అంటున్నారు.

ఇంతకీ ఆ కీలక నేత ఎవరంటే.

మాగుంట శ్రీనివాసుల రెడ్డి.

తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న మాగుంట ఇప్పుడు పార్టీ ని వీడటం అది కూడా తెలుగుదేశం ఉన్న క్లిష్టమైన పరిస్థితిలో పార్టీ ని వీడి పోవడం చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బే అని చెప్పవచ్చు.అయితే బాలి నేని తానూ పశ్చిమ నియోజక వర్గాలలో పోటీ చేయడానికి సిద్దమని చెప్పడంతో మాగుంట కి లైన్ క్లియర్ అయిందంటున్నారు.

అందుకే జగన్ కూడ మాగుంట కుటుంబం రాకను స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మాగుంట టీడీపీ లో ఉంటే అసెంబ్లీ టిక్కెట్టు రాదనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీని వీదనున్నారని తెలుస్తోంది.

అంతేకాదు మాగుంట వైసీపిలోకి వస్తానని అనుకున్నప్పుడు జగన్ పీకే తో సర్వే చేయించారట సర్వే అనతంరం పేకే రిపోర్ట్ రిజల్స్ కారణంగా జగన్ మాగుంటకి ఒకే చెప్పాడని అంటున్నారు.ఏది ఏమైనా సరే కీలక సమయంలో ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీని వీడటం చంద్రబాబు కి కోలుకోలేని షాక్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube