ప్రకాశం జిల్లాలో మరో పరువు హత్య కలకలం..! పరువు తీస్తోందని కోపంతో కన్న కూతురి గొంతు నులిమి చంపేసిన తండ్రి!  

  • తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పరువు హత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది… తాజాగా ప్రకాశం జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఓ తండ్రి కన్నకూతురిని గొంతు నులిమి చంపేశాడు. సోమవారం వేకువజామున తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలలోకి వెళ్తే

  • తాళ్లూరు మండలం కొత్తపాలెంకు చెందిన కోట వైష్ణవి ఒంగోలులో డిగ్రీ చదువుతోంది. ఒంగోలులోని ఓ ప్రవేట్‌ కళాశాలలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న వైష్ణవి జూ కళాశాలకు చెందిన బస్సులోనే వెళ్లేది. అదే కళాశాలలో చదివే లింగసముద్రం గ్రామానికి చెందిన యువకుడితో వైష్ణవి ప్రేమలో పడింది. గత గురువారం కళాశాల బస్సులో వస్తూ ఆస్పత్రికి వెళ్లాలని తోటివారికి చెప్పి మధ్యలో దిగిన వైష్ణవి ప్రియుడి సూచన మేరకు తిరుపతి చేరుకుంది.

  • Prakasam District Talluru Father Killed Daughter-Father Daughter Love Problems

    Prakasam District Talluru Father Killed Daughter

  • విషయం తెలుసుకున్న కుటంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కౌల్సిలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఆ మర్నాడే స్నానం చేయడానికి అని చెప్పి స్నానాల గదికి వెళ్లిన వైష్ణవి అక్కడి నుంచి మాయమైంది. మార్కాపురంలో ఉందని తెలుసుకుని మళ్లీ తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా వైష్ణవి పద్దతి మార్చుకోక పోవటం, మంచి చెప్పిన బంధువులపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆదివారం రాత్రి తండ్రి, కూతురి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

  • Prakasam District Talluru Father Killed Daughter-Father Daughter Love Problems
  • కూతురితో జరిగిన గొడవలో ఆగ్రహంతో ఊగిపోయి తండ్రి కూతుర్ని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు వెంకారెడ్డి తన కూతురైన వైష్ణవిని చంపినట్టు తెలుస్తోంది.