ప్రవాస భారతీయుడికి ప్రతిష్టాత్మక అవార్డ్..!!  

Prajapati Trivedi Awarded Performance Management Practice-

ప్రజాపాలన విభాగంలో గణనీయమైన మార్పులని తెచ్చేందుకు కృషి చేసే వారికి “హ్యారీ హ్యాట్రీ డిస్టింగ్యూష్‌డ్‌ పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ అవార్డ్‌” ఇస్తుంటారు. ఈ అవార్డుని ప్రతీ ఏడాది ఇస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ అవార్డు ని లండన్ లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి దక్కింది...

ప్రవాస భారతీయుడికి ప్రతిష్టాత్మక అవార్డ్..!!-Prajapati Trivedi Awarded Performance Management Practice

ప్రజాపాలన విభాగంలో ఆయన చేసిన సేవల్ని గుర్తించి 2019 ఏడాదికి ఈ అవార్డును ప్రజాపతికి బహూకరించారు. వాషింగ్టన్ లో జరిగిన ఈ వేడుకల్లో “సెంటర్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ పర్ఫార్మెన్స్‌ , అమెరికన్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లు ఈ అవార్డుని ప్రధానం చేశాయి.

అయితే ఈ అవార్ధుని పొందిన తొలి బారతీయుడు గా త్రివేది రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ ఇప్పటి వరకూ తానూ పొందిన అవార్డ్ కంటే ఇది ఎంతో ప్రత్యేకమైనది అని అన్నారు. త్రివేది గతంలో భారత పీఎంవో లో శాశ్వత కార్యదర్శి గా పని చేశారు.